నయన్ కి 36 .. విఘ్నేష్ కి 35

0

క్రికెట్ గాడ్ గా ప్రసిద్ధి చెందారు సచిన్ టెండూల్కర్. ఏజ్ తో సంబంధం లేకుండా ఆయన టీమిండియా ఆటగాడిగా కెరీర్ ని సాగించారు. ఇప్పుడు అలానే ఫిలింఇండస్ట్రీని ఏల్తోంది నయన్. 36 వయసులోనూ అసాధారణ క్రేజు ఉన్న తారగా నయన్ పేరు మార్మోగుతోంది. కోలీవుడ్ లో తలైవిగా టాలీవుడ్ లో నాయకిగా వెలిగిపోతోంది. లేడీ ఓరియెంటెడ్ అంటే నయనతార పేరునే తలుచుకుంటున్నారు మేకర్స్. అంతటి పాపులారిటీ సమకాలీన నాయికల్లో వేరొకరికి లేదంటే అతిశయోక్తి కాదు.

ఏజ్ లెస్ బ్యూటీగా.. గొప్ప ప్రతిభావనిగా నయన్ కి ఇంత ఫాలోయింగ్ ఏర్పడింది. నేటితో ఈ నటికి 36 ఏళ్లు. ఈ సందర్భంగా ప్రియుడు కం దర్శకుడు విఘ్నేష్ శివన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టినరోజున అర్ధరాత్రి గడియారం 12 ముళ్లును తాకిన కొద్దిసేపటికే నయన్ కోసం ఒక ప్రత్యేక పోస్ట్ ను పంచుకున్నారు. నయనతార ఫోటోల్ని అతడు షేర్ చేశారు.

“తంగమే.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు“ అంటూ షేర్ చేసిన ఫోటోల్లో నయనతార తెల్లటి టీ-షర్టు సీక్విన్ స్కర్ట్ ధరించి లాస్ ఏంజిల్స్ లోని శాంటా మోనికా పీర్ వద్ద పోజులివ్వడం కనిపిస్తోంది.

నేడు నయన్ నటించిన థ్రిల్లర్ మూవీ `నెట్రికాన్` టీజర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ పోస్టర్ ను విఘ్నేష్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్ఫూర్తిదాయకమైన అంకితభావంతో.. నిజాయితీగల వ్యక్తిగా .. ఎదుగుతూ ఉండండి! దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.. స్థిరమైన విజయం దక్కాలి! అన్న వ్యాఖ్యను ఆయన జోడించారు.

మిలింద్ రౌ దర్శకత్వం వహించిన నేట్రికాన్ .. కొరియన్ చిత్రం బ్లైండ్ కి అధికారిక రీమేక్. నయనతార ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. సెప్టెంబరులో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ తరువాత.. నయనతార – విఘ్నేష్ శివన్ గోవాలో విశ్రాంతి తీసుకున్నారు. తన 35 వ పుట్టినరోజును గోవాలో నయనతార ఆమె కుటుంబంతో జరుపుకున్నారు విఘ్నేష్.

విఘ్నేష్ దర్శకత్వం వహించిన 2015 చిత్రం `నానుమ్ రౌడీధాన్` సెట్స్లో నయనతార- విఘ్నేష్ శివన్ తొలిసారి కలిశారు. ఇందులో నయనతార ప్రధాన పాత్రలో నటించారు. ఆ తర్వాత వారు ప్రేమలో పడ్డారు. నయన్ ప్రస్తుతం `అజ్ఞత్తె`లో రజనీకాంత్ సరసన నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)