ఫస్ట్ తెలుగు జాంబీ మూవీ ‘జాంబీ రెడ్డి’ షూటింగ్ పూర్తి..!

0

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న మూడో సినిమా ”జాంబీ రెడ్డి”. ‘అ!’ ‘కల్కి’ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.. ఈసారి జాంబీ నేపథ్యంలో విభిన్న తరహా చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. జాంబీ కథాంశంతో టాలీవుడ్ లో వస్తున్న మొట్ట మొదటి చిత్రం ఇదేనని చెప్పవచ్చు. ఈ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన తేజ సజ్జ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ‘జాంబీ రెడ్డి’ టైటిల్ లోగో మరియు చిత్ర ఫస్ట్ లుక్ ఆసక్తిని కలిగించాయి. అయితే ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ అయిందని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ప్రస్తుతం ”జాంబీ రెడ్డి’ డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ వివరాలను వెల్లడిస్తూ చిత్ర యూనిట్ హీరో తేజ సజ్జ మరియు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డబ్బింగ్ స్టూడియోలో ఉన్న ఓ ఫోటోని షేర్ చేశారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్స్ విల్లే స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. అనిత్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. మార్క్ కె.రాబిన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ ‘జోంబీ రెడ్డి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా హాలీవుడ్ లో జాంబీల కాన్సెప్ట్ తో అనేక సినిమాలు రూపొందాయి. ఇప్పుడు కర్నూల్ బ్యాగ్రౌండ్ లో వస్తున్న ఈ ‘జాంబీ’ ఫిక్షనల్ క్యారెక్టర్ తెలుగు ఆడియన్స్ కి ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందో చూడాలి.