టీజర్: ”నెట్రికాన్”

0

దక్షిణాది అగ్ర కథానాయిక నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ తమిళ్ మూవీ ”నెట్రికాన్”. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని క్రాస్ పిక్చర్స్ తో కలిసి నిర్మించాడు. ‘గృహం’ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న మిలింద్ రౌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. నేడు నయనతార బర్త్ డే సందర్భంగా ఆమెకు విషెస్ తెలియజేస్తూ చిత్ర యూనిట్ ‘నెట్రికాన్’ టీజర్ ని విడుదల చేశారు. ఇందులో నయనతార అంధురాలిగా మరో ఛాలెంజింగ్ రోల్ లో కనిపించబోతోందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది.

టీజర్ లో అంధురాలైన నయనతార ఓ సైకో కిల్లర్ కోసం వేట సాగిస్తున్నట్లు చూపించారు. ఎలాంటి క్యారెక్టర్ అయినా అవలీలగా పోషించే నయనతార మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను మెప్పించనుందని అర్థం అవుతోంది. టీజర్ లో ఆమె స్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అంధురాలిగా మారిన ఓ పోలీస్ అధికారిణి తనకు ఎదురుపడే సవాళ్లను ఎదుర్కొని ఎలా పరిష్కరిస్తుందనేది ఇందులో చూపించనున్నారు. దీనికి గిరీష్ గోపాలకృష్ణన్ అందించిన నేపథ్య సంగీతం థ్రిల్ కి గురి చేస్తోంది. డీఓపీ ఆర్ డీ రాజశేఖర్ విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో అజ్మల్ – మణికందన్ – శరణ్ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. ‘గృహం’ తరువాత మిలింద్ మరో వైవిధ్యమైన చిత్రంతో రాబోతున్నట్లు తెలుస్తోంది. టీజర్ తోనే అంచనాలను పెంచేసిన నయనతార ‘నెట్రికాన్’ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.