సూపర్ స్టార్ తో క్రికెట్ స్టార్

0

సూపర్ స్టార్ విజయ్ ని క్రికెట్ స్టార్ వరుణ్ చక్రవర్తి కలిశాడు. క్రికెట్ లో ఈమద్య కాలంలో చాలా ఫేమస్ అయిన వరుణ్ చక్రవర్తికి తమిళ స్టార్ విజయ్ అంటే అభిమానం. ఆ అభిమానంతో ఇటీవల కలిసిన వరుణ్ ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు స్టార్స్ కనిపించడంతో తమిళ సోషల్ మీడియా ఫాలోవర్స్ తో పాటు అంతా కూడా వావ్ అంటున్నారు. నెట్టింట ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఇద్దరు స్టార్స్ ను ఒక్క ఫ్రేమ్ లో చూసే అవకాశం రావడం హ్యాపీగా ఉందంటూ వరుణ్ పోస్ట్ కు కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం విజయ్ మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. థియేటర్లు ఎప్పుడు పూర్తి స్తాయిలో రన్ చేస్తాయో వెంటనే విడుదల చేయాలని భావిస్తున్నారు. మరో వైపు విజయ్ కొత్త సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇదే సమయంలో విజయ్ రాజకీయ రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయన తండ్రి పార్టీ పెట్టడంతో చర్చ తీవ్రతరం అయ్యింది. ఇద్దరి మద్య విభేదాలు భగ్గునన్నాయి.