టాలీవుడ్ ఎంట్రీ కోసమే ఇలా కవ్విస్తోందట

0

సోషల్ మీడియాని యూత్ ప్రచారాస్త్రంగా మలుచుకుని బాగానే లబ్ధి పొందుతున్నారు. అవకాశాల కోసం ఈ వేదికని ఉపయోగించుకుంటున్నారు. తమ టాలెంట్ ని పూర్తిగా ప్రదర్శించి ఆకర్షించడంలో ఆరితేరిపోతున్నారు. రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటో షూట్ లతో నెటిజన్ ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. దీంతో సెలబ్రిటీ కాకుండానే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్.. ఫ్యాన్ బేస్ ఏర్పడుతోంది.

ఇదే ఫార్ములాని శర్మా సిస్టర్స్ తెలివిగా ఎన్ క్యాష్ చేసుకోవడం ఇటీవల యువతరంలో చర్చకు వచ్చింది. `చిరుత` ఫేమ్ నేహా శర్మ సోదరి ఐషాశర్మ కూడా ఇదే ఫార్ములాని ఫాలో అవుతోంది. కింగ్ ఫిషర్ క్యాలెండర్ – లాక్మే- పెస్సీ యాడ్ లలో కనిపించిన ఐషా విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో అందాలు ఆరబోసి హాట్ టాపిక్ గా మారింది.

ఆ తర్వాతా వరుస ఫొటో షూట్లలో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. సత్యమేవజయతే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఐషా అక్క నేహా శర్మ తరహాలోనే రాణించలేకపోతోంది. తాజాగా ఐషా శర్మ షేర్ చేసిన హాట్ ఫొటోలు ఇన్ స్టాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలకు యువతరం వేడెక్కించే కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు. కవ్వించడం శర్మా గాళ్ కి కొత్తేమీ కాదుగా అంటూ వ్యాఖ్యల్ని జోడిస్తున్నారు. మీమ్స్ ఈమోజీల్ని షేర్ చేస్తున్నారు. శర్మా గాళ్ త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ కోసం సన్నాహకాల్లో ఉందన్న గుసగుసలు ఇటీవల వినిపిస్తున్నాయి.