ఓనం పండక్కి స్పెషల్ విమానంలో దిగిన ప్రేమ గువ్వలు

0

సౌత్ లో మోస్ట్ వాంటెడ్ లవ్ కపుల్ ఆ పాపులరయ్యారు నయన్ – విఘ్నేష్ జంట. ఆ ఇద్దరూ ఎటెళ్లినా చీమ చిటుక్కుమాన్నా అది మీడియాలకెక్కేస్తుంది. అటుపై రచ్చ రచ్చే. ఇదిగో ఇప్పుడు ఏకంగా ఓనం పండక్కి స్పెషల్ విమానంలో దిగడం కంట పడింది. ఇంకేం ఉంది? మీడియాకి పండగే పండగ.

నయనతార తన కాబోయే వాడు విగ్నేష్ శివన్ తో ఈ రోజు కొచ్చిలో అడుగుపెట్టారు. స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఓనం పండగ జరుపుకోవడానికి వారు చెన్నై నుండి చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. విమానం దిగేప్పుడు తీసిన స్టార్ కపుల్ కి సంబంధించిన ఫ్లాష్ లు అంతర్జాలాన్ని సుడిగాలిలా చుట్టేసాయి.

ఇక తాజాగా రివీలైన ఫోటోలో నయనతార అల్ట్రా మోడ్రన్ లుక్ కట్టి పడేస్తోంది. బ్లూ షూట్ కి కాంబినేషన్ గా బ్లాక్ గాగుల్స్ తో రచ్చ లేపింది ఈ కిల్లింగ్ లేడీ. తన చెంతనే రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ డ్రెస్ లో విఘ్నేష్ స్టార్ లా మెరిసిపోతున్నాడు.

కొన్నేళ్ల క్రితం `నానుమ్ రౌడీ ధాన్` చిత్రం కోసం ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు కలిసి పనిచేసారు. నాటి నుంచి నయన్ – విఘ్నేష్ ఒకరి ప్రేమలో ఒకరు తలమునకలుగా ఉన్నారు. ఈ జంట వివాహంపై చాలాసార్లు రకరకాలుగా పుకార్లు షికారు చేశాయి. కానీ ఈ జంట అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. డేటింగ్ లైఫ్ లో విసుగు చెందితేనే పెళ్లి చేసుకుంటామని ఇటీవల విఘ్నేష్ చమత్కరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎవరికి వారు కెరీర్ పరంగా బిజీగా ఉన్నామని అతడు తెలిపారు.