మొత్తానికి సమంత స్నేహితులు సో క్యూట్

0

అక్కినేని కోడలు సమంతకు పెట్స్ అంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనే లేదు. పెట్ డాగ్స్ తో నిరంతరం ఆటలాడుకోవడం.. సరదాగా షికార్లు చేయడం తనకు అలవాటు. ఇంటి ఆవరణలో గార్డెనింగ్ చేసినా.. లేదా అక్కడ ఆరాంగా సేదదీరుతున్నా తనతో పెట్ డాగ్ కూడా ఉండాల్సిందే.

ఇటీవల గచ్చిబౌళిలో ఖరీదైన అపార్ట్ మెంట్ లో ఉంటున్న సమంత అటు అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్లినప్పుడు అంతే రిలాక్స్ డ్ గా ఉంటారు. ఇక తన చెంతకు వచ్చిన ఆ రెండు పెట్ డాగ్స్ మాత్రం తనకు ఎంతో క్లోజ్. ఇక ఇందులో ఒకటి నాగచైతన్యతో తన ప్రేమవ్యవహారం గుట్టును రట్టు చేసిందని అప్పట్లో నాగార్జున స్వయంగా తెలిపారు.

తాము ఎవరూ కనిపెట్టలేనిది ఆ పెట్ డాగ్ కనిపెట్టేసిందంటూ కితాబిచ్చారు కింగ్. చైతూని సామ్ రహస్యంగా కలుసుకునే వ్యవహారాన్ని ఆ డాగ్ లీక్ చేసిందని అన్నారు. అదంతా సరే కానీ.. ఇదిగో ఇక్కడ డార్క్ బ్రౌన్ కలర్ లో ఉన్న స్పెషల్ బ్రీడ్ డాగ్ ఎంతో ముద్దొచ్చేస్తోంది. అది సామ్ తో డిన్నర్ కి వచ్చిందట. సో క్యూట్ అంటూ రాశీఖన్నా రిప్లయ్ కూడా ఇచ్చింది ఈ ఫోటో చూసి. వేరొక చోట మిర్రర్ లోంచి చూస్తున్న సమంత చెంతనే వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ మిక్స్ డ్ కలర్ తో కనిపిస్తున్న ఆ క్యూట్ డాగ్ కూడా అంతే ముద్దొచ్చేస్తోంది. దీనికి ఒక అభిమాని `లవ్ దిస్ మదర్ సన్ డ్యూయో` అంటూ కామెంట్ ని పెట్టాడు. మొత్తానికి సమంత స్నేహితులు సో క్యూట్ అన్నమాట.