Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆ వెబ్ సిరీస్ ఆపేయాలంటూ ‘నెట్ఫ్లిక్స్’కు ఎన్సిపిసిఆర్ ఆదేశాలు!

ఆ వెబ్ సిరీస్ ఆపేయాలంటూ ‘నెట్ఫ్లిక్స్’కు ఎన్సిపిసిఆర్ ఆదేశాలు!


ఇటీవలే పిల్లల గురించి అనుచితంగా చిత్రికరించిందని “బొంబాయి బేగమ్స్” అనే వెబ్ సిరీస్ ప్రసారాలను ఆపేయాలని జాతీయ బాలల హక్కుల సంఘం (ఎన్సిపిసిఆర్) నెట్ఫ్లిక్స్ ఓటిటిని కోరింది. ఈ విషయం పై నెట్ఫ్లిక్స్కు గురువారం ఇచ్చిన నోటీసులో.. బాలల హక్కుల పరిరక్షణ కోసం నేషనల్ కమిషన్ (ఎన్సిపిసిఆర్) 24 గంటల్లో వివరణాత్మక కార్యాచరణ నివేదికను సమర్పించాలని ఓటిటి ప్లాట్ఫామ్ను ఆదేశించింది. మీ వివరణ విఫలమైతే తగిన చట్టపరమైన చర్యలకు అర్హులవుతారని తెలిపింది. బాంబే బేగమ్స్ వెబ్ సిరీస్ లో ఆడపిల్లలను అనుచితంగా చూపడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అటువంటి కంటెంట్ పిల్లల మనస్సులను కలుషితం చేస్తుందని.. అలాగే పిల్లల భవిష్యత్ దుర్వినియోగం చేస్తుందని కమిషన్ తెలిపింది.

ఈ సిరీస్ లో లైంగికంగా దోపిడీకి గురై.. మాదకద్రవ్యాలకు పాల్పడే మైనర్లను చూపించడం పై ఆరోపించిన ఫిర్యాదు ఆధారంగా కమిషన్ చర్యలు చేపట్టింది. ‘నెట్ఫ్లిక్స్ లాంటి ఓటిటిలు పిల్లల విషయంలో లేదా పిల్లలకోసం ఏదైనా కంటెంట్ ను ప్రసారం చేసేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అలాంటి అనుచిత కంటెంట్ జోలి కి వెళ్లకుండా ఉండాలి” అని కమిషన్ తన నోటీసులో పేర్కొంది.

అందువల్ల ఈ విషయాన్ని పరిశీలించి వెంటనే ఈ సిరీస్ యొక్క ప్రసారాన్ని ఆపివేసి 24 గంటలలోపు ఒక వివరణాత్మక కార్యాచరణ నివేదికగా ఇవ్వమని నెట్ ఫ్లిక్స్ నిర్దేశించబడింది. సరైన వివరణ లేకపోతే CPCR ప్రకారం.. సెక్షన్ 14 లోని ( 2005 చట్టం కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలను తీసుకోవడానికి కమిషన్ రెడీగా ఉన్నట్లు తెలిపింది. కాగా “బాంబే బేగమ్స్” సమాజం లోని వివిధ వర్గాలకు చెందిన ఐదుగురు మహిళల జీవితాల ను చూపిస్తుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ నుండి ఈ వెబ్ సిరీస్ తొలగించినట్లు సమాచారం.