నిధి అగర్వాల్ భంగిమ కునుకు పట్టనిస్తుందా?

0

అక్కినేని నాయికగా టాలీవుడ్ కి పరిచయమైంది బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్. ఆరంభమే టాలీవుడ్ హాటెస్ట్ హీరోయిన్ గా పాపులరైనా సక్సెస్ ముఖం చాటేయడంతో రేసులో వెనకబడింద. సవ్యసాచి- మిస్టర్ మజ్ను చిత్రాలతో నిధికి కలిసొచ్చిందేమీ లేదు.

రామ్ సరసన `ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో నిధికి పెద్ద బ్రేక్ లభించింది. ఇస్మార్ట్ శంకర్ విజయం కూడా నిధి ఫేట్ ని పూర్తి స్థాయిలో మార్చలేకపోయింది. ఆ తర్వాతా టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్లేవీ దక్కలేదు. ఓ డెబ్యూ హీరో సరసన సంతకం చేసినా ఆ మూవీ రిలీజవుతుందో లేదో కూడా తేలని పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం నిధి తన ఇన్ స్టాలో క్రమం తప్పకుండా లేటెస్ట్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతూ అభిమానుల్ని యంగేజ్ చేస్తోంది. పనిలో పనిగా టాలీవుడ్ నిర్మాతలకు ఈ ఫోటోషూట్లతోనే ఫీలర్స్ వదులుతోంది. తాజా ఫోటోషూట్ లో టాప్ లేపేసింది ఈ హాట్ బ్యూటీ. పింక్ కలర్ దుస్తులలో ప్రఖ్యాత `రెవెరీ మ్యాగజైన్` కు వేడెక్కించే పోజులివ్వడం చర్చకు వచ్చింది. నిధి హీటెక్కించే భంగిమతో కుర్రకారు కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తోంది.

అదిరే నిధి థై సొగసుల ఫోటోషూట్ కి సీతాకోకచిలుక ఎమోజీలను జోడించి మరీ రెవెరీ మ్యాగజైన్ ను ట్యాగ్ చేసింది. ఈ ఫోటోలో అందమైన చిరునవ్వుతో నిధి హాట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. కెరీర్ సంగతి చూస్తే.. తమిళ డెబ్యూ చిత్రం `భూమి` విడుదల కావాల్సి ఉండగా..మరో తమిళ చిత్రం `ఈశ్వరన్` కు నిధి సంతకం చేసింది.