Templates by BIGtheme NET
Home >> Cinema News >> పెళ్లికి ముందు వరుస పార్టీలతో నిహారిక బిజీ బిజీ

పెళ్లికి ముందు వరుస పార్టీలతో నిహారిక బిజీ బిజీ


నిహారికా కొణెదెల- చైతన్య దంతులూరి జంట వివాహం డిసెంబర్ 9 న ఉదయపూర్ లోని పాపులర్ హోటల్ లో జరగనుంది. ఈ వేడుకను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దగ్గరుండి పర్యవేక్షించనుండగా మెగా హీరోలంతా అతిథుల్ని రిసీవ్ చేసుకుంటూ సందడి చేయనున్నారని తెలుస్తోంది. ఏర్పాట్ల బాధ్యత అంతా నిహారిక అన్నగారైన వరుణ్ తేజ్ చూస్తున్నారు. ప్రత్యేక అతిథులందరికీ ఇప్పటికే ఆహ్వానం అందిందని తెలిసింది.

ఈ పెళ్లికి చాలా ముందే నిహారిక తన ఫ్రెండ్స్ కి గోవాలో అదిరిపోయే బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిహారికకే తన ఫ్రెండ్స్ ఈ పార్టీ చేశారన్న ప్రచారం కూడా సాగింది. ఇటీవలే తన మెగా సిస్టర్స్ అందరికీ ఖరీదైన హోటల్లో అదిరిపోయే డిన్నర్ పార్టీ ఇచ్చారు నిహారిక. ప్రీవెడ్డింగ్ వేడుకలు సైలెంట్ గా సాగిపోతున్నాయి.

ఇంకా పెళ్లికి ముందు నిహారికా తన సన్నిహితులకు ప్రత్యేక విందు ఇస్తోందని తెలుస్తోంది. వివాహం తర్వాత ఆమె హబ్బీ తో నివశిస్తుంది కాబట్టి ముందే ఇంట్లో అందరికీ విందు కార్యక్రమాలు ఏర్పాటు చేసేసిందిట.

పెళ్లికి ముందు కోవిడ్ వల్ల భారీ విందు కార్యక్రమాలకు అనుమతి లేదు కాబట్టి నిహారిక తన పరిశ్రమను స్నేహితులను చక్కగా గ్రూపులుగా విభజించి.. ఒక్కో సమూహాన్ని గత కొన్ని రోజులుగా విడివిడిగా ఆహ్వానిస్తున్నారట. ఘనంగా పార్టీలు జరుగుతున్నాయి. పెళ్లికి ఇంకో 8రోజులే మిగిలి ఉంది. ఈలోగానే అన్ని పార్టీలు పూర్తవుతాయి.