18 పేజెస్ .. కార్తికేయ 2 .. ఏది ముందు నిఖిల్?

0

స్వయంకృషితో ఎదిగిన హీరోగా మెగాస్టార్ చిరంజీవి ఎందరికో స్ఫూర్తి. నవతరం హీరోలకు ఆయనే స్ఫూర్తి. నేటి తరంలో ప్రతిభతో నెగ్గుకు వస్తున్న హీరోలు చిరుని ఆరాధిస్తున్నారు. ఎనర్జిటిక్ హీరో నిఖిల్ చిరు పవన్ స్ఫూర్తితో ఈ రంగంలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతడి ఎంపికలు ఎక్స్ క్లూజివ్ అనే చెప్పాలి. వైవిధ్యమైన స్క్రిప్టుల్ని ఎంచుకుని తెలివైన ప్రణాళికలతో ఈ యంగ్ హీరో దూసుకెళుతున్నాడు. మీడియం రేంజ్ బడ్జెట్లకు న్యాయం చేస్తూ బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు తెస్తున్నాయి అతడు నటించినవి.

నిఖిల్ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నాడు ఒకటి గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో `18 పేజెస్ సినిమా మరొకటి కార్తికేయ2 సెట్స్ పై ఉన్నాయి. వీటిలో కరోనా క్రైసిస్ కారణంగా కార్తికేయ 2 కంటే 18 పేజీస్ ముందు రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అక్టోబర్ రెండో వారం నుంచి 18 పేజీస్ షూటింగ్ మొదలవ్వబోతుంది. ఇందులో హీరోయిన్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఇద్దరు భామల్ని అనుకుంటున్నారని తెలిసింది.

అయితే నిఖిల్ సరసన జాక్ పాట్ కొట్టిన ఆ ఇద్దరు భామల్లో బన్ని హీరోయిన్ ఉందిట. ఎవరా భామ? అంటే నా పేరు సూర్య ఫేం అను ఇమ్మాన్యుయేల్ ని ఫైనల్ చేశారట. ఇక ఇస్మార్ట్ శంకర్ తో బంపర్ హిట్ కొట్టినా సరైన అవకాశాలు రాక సతమతమవుతున్న నిధి అగర్వాల్ ని మరో నాయికగా ఓకే చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.