Templates by BIGtheme NET
Home >> Cinema News >> గోల్డ్ శారీ లో టీవీ న‌టి నిఖిత

గోల్డ్ శారీ లో టీవీ న‌టి నిఖిత


టీవీ న‌టి, మోటివేష‌న‌ల్ స్పీక‌ర్ .. మూడు డిగ్రీలు సాధించిన అరుదైన‌ వ్య‌క్తిత్వం నిఖిత శ‌ర్మ తాజా సోష‌ల్ మీడియా యాక్ట్ ఇప్పుడు అభిమానుల్లో చ‌ర్చ‌కు వచ్చింది. ఎన్ని డిగ్రీలు సాధించినా సంపాద‌న అనే డిగ్రీ చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. దానికోసం చాలా మంది సెల‌బ్రిటీలు సినిమా- టీవీ వంటి న‌ట‌నారంగాల‌ను ఎంచుకున్నారు. నిఖిత కూడా అందుకు అతీతం కాదు. ఇటీవ‌ల సోష‌ల్ మీడియా ఆదాయానికి కీల‌క మార్గంగా మార‌డంతో నిఖిత నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్లు, వీడియోషూట్ల‌ను ఇన్ స్టాలో షేర్ చేస్తోంది.

తాజాగా నిఖిత బోల్డ్ ఫోటోషూట్ ని షేర్ చేయ‌గా అది యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది. గోల్డ్ క‌ల‌ర్ స్పెష‌ల్ శారీ కాంబినేష‌న్ బ్లౌజ్ లో నిఖిత ఎంతో అందంగా వేడిగా క‌నిపిస్తోంది. ఇదిగో ఇలా అందాలను ఎలివేట్ చేస్తూ టూ బోల్డ్ గా క‌నిపించింది. అయితే ఇదంతా లైక్ లు క్లిక్ ల కోసం ఒక గేమ్.

ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అవ‌కాశాల‌ను వెతుక్కునే రోజులు కావు ఇవి. ట్యాటెంట్ ఫ్లెక్సిబిలిటీ అంతా సామాజిక వేదిక‌ల‌పైనే క‌నిపిస్తోంది. ఎవ‌రైనా అవ‌కాశాలు ఇవ్వాలంటే డిజిట‌ల్ మీడియాలో తొలిగా సెల‌బ్ ప్రొఫైల్ ని ప‌రిశీలిస్తే స‌రి. ఇటీవ‌ల నిఖిత శ‌ర్మ వ‌రుస ఫోటోషూట్ల‌కు సంబంధించిన ఫోటోలు వీడియోల‌ను ప‌రిశీలిస్తే ఇది అవ‌గ‌త‌మ‌వుతుంది. ప్ర‌ధానంగా హిందీ బుల్లితెర‌పై అవ‌కాశాలు అందుకుంటున్న నిఖిత‌కు ఇంకా తెలుగు-త‌మిళ సినీప‌రిశ్ర‌మ‌ల్లో అంత‌గా అవ‌కాశాలేవీ లేవు. అయితే సినీరంగంలో రాణించి భారీ ప్యాకేజీలు అందుకోవ‌డం కోసం ప్ర‌య‌త్నించ‌ని వారు ఉంటారా? ప్ర‌స్తుతం ఈ టీవీ బ్యూటీ క‌న్ను టాలీవుడ్ పైనా ఉంద‌ని తెలిసింది.

నిఖిత ప్రొఫైల్ : నికితా శర్మ మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, జువాలజీలో ట్రిపుల్ మేజర్స్ డిగ్రీని సాధించిన న‌టి. తన NGO సిల్వర్ లైనింగ్స్ ద్వారా క్యాన్సర్ పరిశోధన – అవగాహన రంగంలో చురుకుగా ఉంది. నిఖిత‌ శర్మ ఫిట్‌నెస్ నిపుణురాలు, మోటివేషనల్ స్పీకర్, ఫ్యాషన్ మోడల్ కూడా. ఆమె సోషల్ మీడియా ఔట్రీచ్ బాడీ షేమింగ్ వంటి సమస్యలను పరిష్కరిస్తుంది. లింగ సమానత్వం, మహిళా సాధికారత, స్వీయ అంగీకారం, శరీర సానుకూలతను ప్రోత్సహించే గ్రేట్ మోటివేట‌ర్ కూడా.