Home / Cinema News / పెళ్లయ్యాక యూత్ స్టార్ ఎనర్జీ డబుల్

పెళ్లయ్యాక యూత్ స్టార్ ఎనర్జీ డబుల్

బ్యాచిలర్ షిప్ ని త్యాగం చేస్తూ హీరోలంతా ఓ ఇంటివాళ్లయిపోతున్నారు. మహమ్మారీ వైరస్ బిజీ లైఫ్ హీరోలకు సరికొత్త సొల్యూషన్ వెతికి పెట్టింది. వరుసగా నలుగురు హీరోలు వెడ్ లాక్ అయిపోయారు. ఇందులో యూత్ స్టార్ నితిన్ కూడా ఉన్నాడు.

హీరో నితిన్ ఇటీవల పెళ్లి పేరుతో సంబరాల్లో మునిగి తేలాడు. అతను గత కొన్ని వారాలుగా భార్య షాలినితో తన విలువైన సమయాన్ని ఆస్వాధిస్తున్నాడు. అయితే పెళ్లి తర్వాత హనీమూన్ ట్రిప్ లోకల్ గానేనా? లేక ఇంకెక్కడికైనా వెళ్లారా ఈ దంపతులు అన్నది తెలీదు.

ఇక పెళ్లి వేడుకల సంగతి అటుంచితే.. నితిన్ బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాల్లో నటించాల్సి ఉంది. అతడు పూర్తి ఫిట్నెస్ కు తిరిగి రావడానికి జిమ్ కి వెళుతున్నాడు. తాజాగా నితిన్ జిమ్ వీడియో ఒకటి అంతర్జాలంలో షేక్ చేస్తోంది. అతను మూడున్నర నిమిషాల్లో 500 జంప్ థ్రెడ్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. నితిన్ పర్ఫెక్ట్ ఫిట్ అని ఈ వీడియో ప్రూవ్ చేస్తోంది. లాక్ డౌన్ టైమ్ కి నితిన్ రంగ్ దే చిత్రీకరణలో ఉన్నాడు. తదుపరి మేర్లపాకా గాంధీ.. చంద్రశేఖర్ యెలేటి.. కృష్ణ చైతన్యలతో కలిసి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. వీటికి సంబంధించి తదుపరి అప్ డేట్ రావాల్సి ఉంది.

500 jumpropes at a strech in 3.25 min Back to grind 💪 with @vamshicoach_boxfitt11 Getting better at lung capacity and immunity with proper fitness and nutrition #boxfitt11 #jumprope

null

Related Images:

SEO Keywords: Not Found

About TeluguNow .

Reviews, Live Updates, Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets Telugu Movie Review, Telugu Movie Ratings, Telugu News, News in Telugu, AP Politics, Telangana News, Gossips, Telugu Cinema News, Wallpapers, Actress Photos, Actor Photos, Hot Photos,
Scroll To Top