నితిన్ మాస్టర్ స్ట్రోక్

0

ఫ్లాప్ స్ట్రీక్ నుంచి బయటపడి ఈ ఏడాది ఆరంభంలో భీష్మ సినిమాతో విజయాన్నందుకున్నాడు నితిన్. ఆ తర్వాత ఆసక్తికర ప్రాజెక్టులను లైన్లో పెట్టాడతను. అందులో ఒకటి హిందీ హిట్ మూవీ అందాదున్ రీమేక్. చాన్నాళ్ల కిందటే ఈ సినిమా ఖరారైనప్పటికీ.. కాస్టింగ్ విషయంలో తర్జన భర్జనలు నడిచాయి. ముఖ్యంగా హిందీలో సినిమాకే హైలైట్గా నిలిచిన టబు పాత్రకు తెలుగులో ఎవరిని తీసుకోవాలనే విషయంలో సందగ్ధత ఎంతకీ తెగలేదు. ఈ పాత్రకు రమ్యకృష్ణ దగ్గర్నుంచి శ్రియ వరకు చాలా పేర్లు వినిపించాయి. కానీ చివరికి తమన్నాను ఈ పాత్రకు ఎంచుకుని పెద్ద షాకిచ్చాడు దర్శకుడు మేర్లపాక గాంధీ. ఇది ఎవరూ ఊహించని ఎంపిక.

టబుకు రీప్లేస్మెంట్ అనగానే మిడిలేజ్డ్ లేడీస్ మీదే అందరి దృష్టీ నిలిచింది. ఐతే ఆ పాత్రకు ఇంకా లైమ్ లైట్లో ఉన్న గ్లామర్ విషయంలో తిరుగులేని తమన్నాను తీసుకోవడం అంటే మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి. భర్త ఉండగా మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునే పాత్రకు తమన్నాను ఎంచుకున్నారంటే ఈ పాత్రకు మరింత గ్లామర్ టచ్ ఇవ్వబోతున్నట్లే. కుర్రాళ్లు మరింతగా ఈ సినిమాకు కనెక్టయ్యే అవకాశముంటుంది. ఒరిజినల్ కంటే కూడా రీమేక్లో ఈ పాత్ర ఇంకా హైలైట్ కావడానికి ఛాన్సుంది. మరోవైపు నభా నటేష్ రూపంలో మరో హాట్ భామను కథానాయికగా ఎంచుకోవడమూ సినిమాకు కలిసొచ్చేదే. మొత్తంగా కాస్టింగ్ విషయంలో దర్శకుడు గాంధీ స్ట్రాటజిగ్గానే అడుగులేశాడు. నితిన్ సొంత సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది.