మర్డర్ గాళ్ బికినీ సెల్ఫీ యమ హాట్ గురూ

0

మల్లికా శెరావత్ .. ఈ పేరు ఒక దశలో బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసింది. కుర్రకారుకి కలల రాణిగా నిలిచి బాలీవుడ్ లో హాట్ ప్రాపర్టీ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. `జీనా సిర్ఫ్ మేరే లియే` మూవీతో మల్లిక ఎంట్రీ ఇచ్చినా 2004లో వచ్చిన `మర్డర్` చిత్రంతో మల్లిక దేశ వ్యాప్తంగా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఓ రేంజ్లో సంచలనం సృష్టించింది. హాట్ హాట్ సన్నివేశాల్లో నటించి బాలీవుడ్ లో కొత్త హాట్ లేడీ వచ్చేసిందంటూ ఓ వేవ్ ని తీసుకొచ్చేసింది.

ఓ తరహా చిత్రాలకు డేర్ అండ్ డెవిల్ గా కెరాఫ్ అడ్రస్ గా నిలిచింది. పరేష్ రావల్.. రేఖలతో కలిసి `బచ్ కె రెహనారే బాబా`.. జారీచాన్తో `ది మిత్` చిత్రంతో చైనీస్ ప్రేక్షకుల్ని అలరించింది. హిస్.. పాలిటిక్స్ ఆఫ్ లవ్- టైమ్ రైడర్స్ వంటి హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి ఔరా అనిపించింది. 2017లో సినిమాలు వదిలేసినా 2019 `బూ సబ్ కీ ఫటేగీ` అంటూ వెబ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసింది.

సినిమాలకు దూరమైనా సోషల్ మీడియా వేదికగా మాత్రం తన అభిమానలతో నిత్యం టచ్ లోనే వుంటూ వస్తోంది. ఏజ్ పెరిగి సినిమాలు తగ్గినా తనలోని గ్లామర్.. ఆ జోష్ ఏమాత్రం తగ్గలేదని… రొమాంటిక్ యాంగిల్ ఇంకా అలానే వుందని నిరూపిస్తూనే వుంది. తాజాగా ఓ సెల్ఫీని అభిమానుల కోసం వదిలింది. బికినీ ధరించి మిర్రర్ ఎదురుగా నిలబడి సెల్ఫీ తీసుకున్న స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. ఈ స్టిల్ చూసి మళ్లీ మల్లీకకు బాలీవుడ్ అవకాశాలిస్తుందేమో చూడాలి.