పవన్ జానూ ఎక్కడుంది.. ఏం చేస్తోంది?

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `తమ్ముడు` మూవీ గుర్తుందా? అందులో జానుగా నటించి ఆకట్టుకున్న నటి ప్రీతి జింగానియా. ఆ తరువాత నరసింహానాయుడు- అధిపతి- అప్పారావు డ్రైవింగ్ స్కూల్ వంటి చిత్రాల్లో నటించి తనదైన అందంతో మనసులు దోచింది. బిగ్ బీ -ఐశ్వర్యారాయ్- షారుఖ్ ఖాన్ తో కలిసి `మొహబ్బతే` లో నటించింది. అలాగే ఎల్ ఓసీ వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటించి ఆకట్టుకుంది.

అల్లరి నరేష్ నటించిన `విశాఖ ఎక్స్ప్రెస్` తరువాత మళ్లీ తెలుగులో కనిపించకుండా పోయింది. 2008లొ కెరీర్ మాంచి ఊపులో వుండగానే పర్వీన్ దాబాస్ ని వివాహం చేసుకుంది. ఆ తరువాత కూడా సినిమాల్లో నటించిన ప్రీతీ 2017 తరువాత కంప్లీట్గా సినిమాలకు దూరమైపోయింది. ఒక విధంగా చెప్పాలంటే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

అయితే తను ఇప్పుడు ఏం చేస్తోంది? .. ఎలా వుంది? అన్నది చాలా మంది ఫ్యాన్స్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగు సినిమాలకు గత 12 ఏళ్లుగా దూరంగా వుంటూ వస్తోంది. ప్రీతికి సంబంధించిన ఫొటోలు తాజాగా బయటికి వచ్చి నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇన్నేళ్లు సినిమాకు దూరంగా వున్నా ప్రీతిలో ఏమాత్రం గ్లామర్ తగ్గలేదు. ఇప్పటికీ బబ్లీ హీరోయిన్ గానే కనిపించడంతో నెటిజన్స్ అంతా వావ్ జానూ అంటూ కేరింతలు కొడుతున్నారు.