పొట్టి ఫ్రాకులో మనోహరి ప్రత్యక్షం

0

చిట్టి పొట్టి దుస్తుల్లో కవ్వించడం.. బికినీలతో వెర్రెత్తించడం.. ఇటీవల ట్రెండ్ గా మారింది. అందాల కథానాయికలు ఎలాంటి మొహమాటం లేకుండా చిట్టి పొట్టి దుస్తుల్లో దర్శనమిస్తున్నారు. ఇక వెస్ట్రన్ భామలైతే మరికాస్త కురచ దుస్తులు అయినా ఫర్వాలేదు. ఎలాంటి ఆంక్షలు లేకుండానే ఫ్యాషన్ ప్రపంచాన్ని ఉరకలెత్తిస్తున్నారు. కుర్రకారు గుండెల్ని చిదిమేస్తున్నారు.

ఇలాంటి టెంప్టింగ్ యాటిట్యూడ్ కి మనోహరి నోరా ఫతేహి కేరాఫ్ అడ్రెస్. నిరంతరం ఏదో ఒక స్పెషల్ ట్రీట్ ఇవ్వనిదే ఈ అమ్మడు నిద్రపోదు. తాజాగా నోరా షేర్ చేసిన సోషల్ మీడియా ఫోటోలు అంతర్జాలంలో దుమారం రేపుతున్నాయి. పసుపు వర్ణం డిజైనర్ ఫ్రాకు పిక్కలపైకి తేలిపోతున్నా అదేమీ పట్టనట్టుగా అందరికీ హాయ్.. చెబుతోంది ఈ బ్యూటీ. పొట్టి ఫ్రాకుకి నల్ల హ్యాండ్ బ్యాగుకి బాగానే సరిజోడు కుదిరింది.

బాహుబలి చిత్రంలో మనోహరి పాటలో అదిరిపోయే స్టెప్పులతో మత్తెక్కించిన ఈ భామ ఆ తర్వాత డార్లింగ్ ప్రభాస్ ని విపరీతంగా పొగిడేసింది. అతడిపై మనసు పడ్డానని అంది. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో పలు ఐటెమ్ నంబర్లలో నర్తించింది. అయితే ఇటీవల ఉత్తరాది పరిశ్రమకే అంకితమై సౌత్ లో అడపాదడపా మెరుస్తోంది. క్రైసిస్ ఈ అమ్మడి ఆఫర్లకు గండి కొట్టినట్టే కనిపిస్తోంది. అన్నట్టు ఓ బాలీవుడ్ హీరో కం మోడల్ తో నిండా ప్రేమలో మునిగిన నోరా .. ఆ తర్వాత బ్రేకప్ చెప్పేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత మాత్రం సోలో స్టాటస్ నే కంటిన్యూ చేస్తోంది.