తాతను తలచుకొని భావోద్వేగానికి గురైన ఎన్టీఆర్.. ట్వీట్ వైరల్!

0

ఇండస్ట్రీలో అప్పుడప్పుడు స్టార్ హీరోలు పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో నెటిజన్లతో పాటు అభిమానులను కూడా కదిలిస్తాయి. అంటే ఒక్కోసారి మన అభిమాన నటులు పెట్టే పోస్టులు అంత హార్ట్ టచింగ్ గా.. ఎమోషనల్ గా మనకు కనెక్ట్ అవుతాయి. ప్రస్తుతం ఓ స్టార్ హీరో ట్విట్టర్ లో పెట్టిన ట్వీట్ కూడా టాలీవుడ్ ప్రేక్షకులను బాగా టచ్ చేస్తోంది. ఎందుకంటే గుండెలను తాకిపో అంటూ పెట్టినటువంటి ఆ ట్వీట్ నిజంగానే ఫ్యాన్స్ గుండెలను తాకుతోంది. మరి అంతలా కదిలించిన ఆ పోస్ట్ ఏంటి.. ఆ హీరో ఎవరు అంటే..? యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ పోస్ట్ ఏంటంటే.. ఈరోజు అన్నగారు సీనియర్ నందమూరి తారకరామారావు గారి 99వ జయంతి. ఈ సందర్బంగా నందమూరి ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఈ జయంతిని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

కాకపోతే లాక్డౌన్ సమయం కాబట్టి మీటింగ్స్ లాంటివి సాధ్యం కాదని సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ పోస్టులు పెట్టుకుంటున్నారు. వారి అభిప్రాయాలు తెలుపుతున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన పోస్ట్ బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ స్పెషల్ డే రోజున ఎన్టీఆర్ నుండి వచ్చిన ఆ స్పెషల్ పోస్ట్ అని చెప్పవచ్చు. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే.. అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ అందమైన ఫోటోతో పాటుగా ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లుతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని – ఈ గుండెను మరొక్కసారి తాకిపో.. తాతా” అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు. ప్రస్తుతం తన తాతయ్య గురించి ఎన్టీఆర్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఇదిలా ఉండగా.. కెరీర్ పరంగా ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ పై అంచనాలు పెంచేసిన ఎన్టీఆర్.. తదుపరి సినిమా కొరటాల శివతో చేయనున్నాడు. ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ మూవీగా రాబోతుందిని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్నటువంటి ఈ సినిమాను కూడా కొరటాల పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు. అందుకే కథకథనాలలో భారీ మార్పులు – టెక్నాలజీని అద్భుతంగా ఉపయోగించుకునే విధంగా రెడీ చేస్తున్నాడట కొరటాల. మరి ప్రస్తుతం మెగాస్టార్ తో ఆచార్య చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో ఇదివరకే జనతాగ్యారేజ్ లాంటి సూపర్ హిట్ ఉంది. చూడాలి మరి ఈసారి కాంబినేషన్ సెకండ్ హిట్ అందుకుంటుందేమో!