భర్తతో రొమాన్స్ లో మునిగిన స్టార్ హీరోయిన్.. పిక్స్ వైరల్!

0

టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీలు ఎంతోమంది ఉన్నారు. కానీ ఎంత గ్లామర్ ఉన్నప్పటికీ అందరికి బాగా నచ్చేది కనెక్ట్ అయ్యేది కొందరు మాత్రమే. అలా కనెక్ట్ అవ్వడంతో పాటు స్టార్డం అందుకున్న స్టార్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్ ముందు వరుసలో ఉంటుంది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. పెళ్లి వార్త చెప్పి అభిమానులకి షాకిచ్చింది అమ్మడు. కానీ ఫోటోషూట్స్ – సినిమాలలో మాత్రం గ్లామర్ డోస్ తగ్గించలేదు. ఇప్పుడు కూడా లాక్డౌన్ కారణంగా ఇంటిపట్టునే ఉంటోంది కాజల్. ఎలాగో ఖాళీనే కదా అని సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది.

అప్పుడప్పుడు ఈ సొగసరి ఘాటైన ఫోటోషూట్స్ తో వేడెక్కిస్తోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేనేళ్లు గడిచినా అమ్మడు అదే తరగని అందంతో మెరిసిపోతుంది. కాజల్ పోస్ట్ చేసిన తాజా గ్లామరస్ ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంతకంటే ముఖ్యంగా కుర్రకారు మతులు పోగొడుతున్నాయి. అమ్మడు షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలో.. భర్త గౌతమ్ వెనకనుంచి కాజల్ ను హగ్ చేసుకోవడం మనం చూడవచ్చు. ప్రస్తుతం భర్తతోనే వివాహ జీవితం ఎంజాయ్ చేస్తోంది. అలాగే వారు ఎంజాయ్ మెంట్ గుర్తుగా ఇలా క్యూట్ పిక్స్ షేర్ చేస్తోంది. ఇక భర్తతో రొమాన్స్ చేస్తున్న కాజల్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదివరకే బెడ్ పై పడుకొని ఉన్నటువంటి పోజు చాలా వైరల్ అయింది. అలాగే చాలా ఫోటోలలో డిఫరెంట్ లెవెల్ గ్లామర్ షో చేసిన కాజల్.. మొత్తానికి ఫ్యాన్స్ అండ్ నేటిజన్లను పెళ్ళైనా వయ్యారాలతో ఊరిస్తోంది. ఇదిలా ఉండగా.. కాజల్ ప్రస్తుతం టాలీవుడ్ లో మెగాస్టార్ సరసన ఆచార్య సినిమాలో నటిస్తోంది. అలాగే పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. ఇటీవలే అమ్మడు వెబ్ సిరీసులు చేస్తూ డిజిటల్ ఇండస్ట్రీలో కూడా అరంగేట్రం చేసేసింది. ప్రస్తుతం పెళ్లి తర్వాత అటు భార్యగా ఇటు హీరోయిన్ గా రెండింటికి సమన్యాయం చేస్తోంది ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ. చూడాలి మరి ఆచార్యలో ఏ రేంజి గ్లామర్ ఒలికించిందో అంటూ ప్రస్తుతం కాజల్ రొమాంటిక్ ఫోటోస్ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.