వాడు నా వెనుకే వచ్చి టార్చర్ పెడుతున్నాడు : ఎన్టీఆర్

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్నేహితుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి చెందిన వారు కొందరు ఉండగా కొందరు ఇండస్ట్రీతో సంబంధం లేని వారు కూడా ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ జాబితాలో ఉంటారు. రాజీవ్ కనకాల చాలా కాలంగా ఎన్టీఆర్ కు మంచి స్నేహితుడు అనే విషయం తెల్సిందే. ఇక మంచు హీరో మనోజ్ మరియు ఎన్టీఆర్ కు ఎంతటి స్నేహం ఉందో కూడా అందరికి తెలుసు. వారిద్దరి మద్య స్నేహం ఇప్పటిది కాదు. దాదాపు పాతికేళ్లుగా వారి స్నేహం కొనసాగుతూ వస్తుంది. పలు ఇంటర్వ్యూల్లో ఎన్టీఆర్ మరియు మనోజ్ లు వారి వారి స్నేహం గురించి చెబుతూ వచ్చారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ మంచు మనోజ్ నన్ను టార్చర్ పెడుతున్నాడు అంటూ సరదాగా వ్యాఖ్యలు చేశాడు.

ఒకసారి బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ రెండు బొమ్మలను తయారు చేశాడు. రూపాలు వేరయినా కూడా ఒకే విధంగా ఆ బొమ్మలు ఆలోచిస్తాయి. కాని ఆ రెండు బొమ్మల్లో ఒక బొమ్మ అల్లరి చేయకుండా వినయంగా ఉండగా మరో బొమ్మ అల్లరి చేస్తూ ఉంది. దాంతో వినయంగా ఉన్న బొమ్మను మొదట కిందకు పంపించాడు. అది నేను అయ్యాను. నన్ను ఎందుకు పంపించవు అంటూ బ్రహ్మను గిల్లి విసిగించడంతో ఆరు గంటల తర్వాత ఆ బొమ్మను పంపించాడు. మోహన్ బాబు గారి ఇంట పుట్టి ఆ బొమ్మ మనోజ్ అయ్యాడు.

వాడు నా కంటే ఆరు గంటలు చిన్న అయినా కూడా నన్ను వాడు పెద్ద వాడు అని చూడడు. అప్పటి నుండి నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నాడు. ఎన్నో సార్లు వారు నన్ను ఇబ్బంది పెట్టాడు. వాడు చేసిన పనుల వల్ల నేను ఎన్ని సార్లు బుక్ అయ్యానో నాకే తెలుసు. వాడు నా వద్దకు వస్తున్నాడు అంటేనే నాకు ప్రకృతి తెలియజేస్తుంది అంటూ ఎన్టీఆర్ సరదాగా మనోజ్ గురించి కామెంట్స్ చేశారు. ఒకరు ఇండస్ట్రీలో సూపర్ స్టార్.. మరొకరు ఇంకా సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా వారి స్నేహం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది.