‘సింహా’ హీరోయిన్ ని BB3లో విలన్ గా తీసుకుంటున్నారా..?

0

నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోయిన్ నమిత కూడా నటించనుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. పదేళ్ల కింద వచ్చిన ‘సింహా’ సినిమాలో బాలయ్య సరసన నమిత నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి బాలయ్య – బోయపాటి కాంబోలో వస్తున్న సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం ఆమెను సంప్రదించారట. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

కాగా ‘సింహా’ ‘లెజెండ్’ వంటి హిట్ సినిమాల తర్వాత బిబి3 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టే ఇటీవల విడుదలైన బిబి3 టీజర్ విశేష స్పందన తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి ద్విపాత్రాభినయం చేస్తారని.. ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని టాక్ నడుస్తోంది. హీరోయిన్లుగా పూర్ణ మరియు ప్రయాగ మార్టిన్ ని తీసుకోగా ఈ మధ్య ప్రయాగ ను తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.