గూగుల్ ట్రెండ్స్ లో నంబర్ 1 వెబ్ సిరీస్ ఇదే

0

ఎంచుకున్న కంటెంట్ ఏదైనా వ్యూవర్ షిప్ చాలా ఇంపార్టెంట్. ఓటీటీల్లో ఎంతో విలక్షణమైన కంటెంట్ ని వీక్షించేందుకు ప్రేక్షకులకు వెసులుబాటు లభించింది. థియేట్రికల్ రిలీజ్ తో పోలిస్తే ఓటీటీ రిలీజ్ అన్నది పూర్తి వైవిధ్యమైనదని ప్రూవ్ అవుతోంది. ఇక్కడ ఏ తరహా క్రియేటివిటీ అయినా ఎగ్జయిట్ చేస్తే ఆదరణ దక్కుతోంది.

ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఫ్యాషన్ ఇండస్ట్రీపై రూపొందించిన `మసాబా మసాబా` సిరీస్ సంచలనాలు సృష్టిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ఆద్యంతం మసాబా గుప్తా- నీనా గుప్తా తల్లీ కూతుళ్ల కెరీర్ లైఫ్ జర్నీకి సంబంధించిన కథతో తెరకెక్కింది. ఇక ఇందులో ఫ్యాషన్ ఇండస్ట్రీకి సంబంధించిన గుట్టు మట్లు రివీల్ చేయడం అందునా రంగుల ప్రపంచపు పోకడల్ని మీడియా అత్యుత్సాహాల్ని తెరపై చూపించిన విధానం సర్వత్రా ఆసక్తిని కలిగించడంతో ప్రతి ఒక్కరూ ఈ వెబ్ సిరీస్ వీక్షణకు ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రస్తుతం గూగుల్ లో ఈ సిరీస్ నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది.

ఒరిజినల్ గా ఇందులో మసాబా గుప్తా.. నీనా గుప్తానే నటించడంతో ఆదరణ మరింతగా ఉందని అంచనా వేస్తున్నారు. ఇంతకుముందు నీనా జాతీయ అవార్డుల సినిమా `బదాయి హూ` లో నటనతో మెస్మరైజ్ చేశారు. మరోసారి అద్భుత అభినయంతో మెరిపించారు. మసాబా మసాబాలో లైవ్ ఫ్యాషన్ ఎక్స్ పీరియెన్స్ కోసం కియారా అద్వానీ.. మాలవికా మోహనన్ మరియు ఫరా ఖాన్ వంటి నిజమైన నటులను ఎంచుకోవడం పెద్ద ప్లస్ అనే చెప్పాలి. ఇక సెలబ్రిటీలతో ఎలాంటి చికాకులు ఉంటాయి? ఇండస్ట్రీపై మీడియా గాసిప్పులు ఎలా చికాకు పెడతాయి? నిప్పుకి పొగకు తేడా ఏమిటి? ఇలా సిరీస్ ఆద్యంతం రక్తి కట్టించారు. ప్రతి 30 నిమిషాల నిడివి ఉన్న ఎపిసోడ్ ఆద్యంతం రక్తి కట్టించేలా తెరకెక్కించడంలో దర్శకులు బిగ్ సక్సెసయ్యారు.