యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Pics.

తెలుగునౌ.కాం 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

నిఖిల్ తో లివింగ్ రిలేషనే.. పెళ్లి కాదన్న నుస్రత్

0

సినిమా తారలు రాజకీయాల్లోకి వస్తే అంతే.. ఇక వారి సంసారాలు సరిగా సాగవని చరిత్ర చెబుతోంది. సీనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వచ్చి లక్ష్మీపార్వతిని చేసుకొని పార్టీని కోల్పోయిన సంగతి తెలిసిందే. మిగతా నటీనటుల పరిస్థితి కూడా అలానే సాగింది.

ప్రముఖ నటి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ తన వైవాహిక స్థితిపై పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఆమె వ్యక్తిగత జీవితంపై పలువురు లేవనెత్తిన ప్రశ్నల గురించి గురువారం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. భారత పార్లమెంట్ లో తన వివాహ స్థితిపై తన వైఖరిని స్పష్టం చేసినట్లు ఈ సందర్భంగా ఆమె పేర్కొంది.

వ్యాపార వేత్త నిఖిల్ జైన్ తో తన వివాహం గురించి నుస్రత్ నోరువిప్పారు. టర్కీలో జరిగిన నా పెళ్లికి వారు హోటల్ బిల్లులు ఖర్చులు కూడా చెల్లించలేదని నుస్రత్ ఆరోపించారు. వారికి నేను ఏమీ చెప్పనవసరం లేదు. నేను నిజాయితీపరురాలిని. నన్ను తప్పుగా చిత్రీకరించారు. ఇప్పుడు నేను ఇదే విషయాన్ని స్పష్టం చేయదలుకున్నాను. ఎవరి పేరు చెప్పకుండా ఇతరులను బాధ్యులను చేయడం.. తప్పుగా చూపించడం చాలా సులభం అని నుస్రత్ పేర్కొన్నారు.

ఇక నవంబర్ లో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరవుతానని నుస్రత్ వెల్లడించారు. ఇటీవల తన స్నేహితురాలైన సినీ నటి స్రబంతి ఛటర్జీ బీజేపీ నుంచి బయటకు రావడంపై స్పందించారు. తాను ఎప్పుడూ రాజకీయ సలహా ఎవరికి ఇవ్వనని స్పష్టం చేసింది.

బెంగాల్ నటి అయిన నుస్రత్ జహాన్ గత పార్లమెంట్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. వ్యాపారవేత్త నిఖిల్ జైన్ ను 2019 జూన్ 19న టర్కీలో పెళ్లి చేసుకున్నారు. నవంబర్ 2020 నుంచి విభేదాల కారణంగా వారిద్దరూ విడిగా ఉంటున్నారు.

ఇటీవలే ఆగస్టు 26న నుస్రత్ మగబిడ్డకు జన్మనిచ్చింది. జనన ధృవీకరణ పత్రంలో యష్ దాస్ గుప్తాను తండ్రిగా చేర్చింది. భారతీయ చట్టాల ప్రకారం నిఖిల్ జైన్ తో తన వివాహం చెల్లదని.. కేవలం లివింగ్ రిలేషన్ షిప్ లో మాత్రమే ఉన్నానని నుస్రత్ గతంలో వెల్లడించి సంచలనం సృష్టించింది.