Templates by BIGtheme NET
Home >> Cinema News >> అక్టోబర్ బాక్సాఫీస్.. ఆగమాగం!

అక్టోబర్ బాక్సాఫీస్.. ఆగమాగం!


అక్టోబర్ నెలలో పెద్ద సినిమాల కంటే కూడా అసలు హీరోలు ఎవరో తెలియని సినిమాలు ఎక్కువగా వచ్చాయి. ఇక కొంతమంది చిన్న హీరోల సినిమాలు కూడా ప్రమోషన్స్ తో బాగానే హడావుడి చేశారు కానీ ఏది కూడా ఊహించని స్థాయిలో అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా రికార్డులను క్రియేట్ చేయలేకపోయాయి. అక్టోబర్ నెలలో మొదటి వారం కలర్ స్వాతి మంత్ అఫ్ మధు, కిరణ్ అబ్బవరం రూల్స్ రంజాన్ అలాగే సుధీర్ బాబు మామా మశ్చీంద్ర అనే సినిమాలు వచ్చాయి.

అలాగే ఈ పోటీలో సిద్ధార్ధ్ కూడా చిన్నా అనే సినిమాతో ఎమోషనల్ గా సక్సెస్ అనుకునే ప్రయత్నం చేశాడు. అలాగే కొత్త హీరోలతో సీతార ఎంటర్టైన్మెంట్ చేసిన మ్యాడ్ ప్రయోగం కూడా ఇదే పోటీలో నిలబడింది. ఇక ముత్తయ్య మురళీధరన్ 800 మూవీ చాలా తక్కువ ధియేటర్లలో తెలుగులో విడుదలయింది

అయితే వీటిలో అన్నిటికంటే ఎక్కువగా మ్యాడ్ సినిమానే మంచి కలెక్షన్స్ అందుకుంది. చిన్నా సినిమాకే ఎక్కువగా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్ కాలేదు. ఇక మిగతా కొన్ని సినిమాలు అయితే కనీసం పెట్టిన పెట్టుబడిలో సగానికి సగం కూడా వెనక్కి తీసుకురాలేకపోయాయి.

ఇక ఆ తర్వాత శుక్రవారం నాతోనే నేను, రాక్షస కావ్యం, తంతిరం.. అనే కొన్ని సినిమాలు వచ్చాయి. ఇక జయం రవి, నయన్ గాడ్ సినిమా కూడా తెలుగులో విడుదలైంది. కానీ రెండవ వారం వచ్చిన సినిమాల్లో ఏది కూడా వీకెండ్ అనంతరం థియేటర్లలో కనిపించలేదు. దసరా పోటీలో మాత్రమే కాస్త బాక్సాఫీస్ ఎక్కువ స్థాయిలో హడావుడి కనిపించింది.

మూడవ వారంలో భగవంత్ కేసరి, లియో, నాగేశ్వరరావు పోటీపడుతూ విడుదలయ్యాయి. వీటిలో లియో సినిమాకు అలాగే టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు నెగిటివ్ టాక్ అయితే గట్టిగానే వచ్చింది. అలాంటి టాక్ వచ్చినప్పటికీ కూడా లియో సినిమా మాత్రమే తట్టుకొని పెట్టిన పెట్టుబడికి మంచి ప్రాఫిట్స్ అందించింది. కానీ టైగర్ మాత్రం ఆ తాకిడిని తట్టుకోలేకపోయింది. ఇక బాలయ్య బాబు భగవంత్ కేసరి సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ అందుకున్నాడు. దాదాపు అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయింది.

నాలుగో వారం మాత్రం పెద్దగా పేరున్న సినిమాలెవీ విడుదల కాలేదు. కేవలం సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్ మాత్రమే కొద్దిగా హడావిడి చేస్తూ థియేటర్లోకి వచ్చింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపలేకపోయింది. కామెడీ సెటైరికల్ మూవీస్ లో కనిపించిన సంపూ ఈసారి మెసేజ్ ఇస్తున్నాడు అనగానే ఆడియన్స్ అటువైపు చూడలేదు. ఈ విధంగా మొత్తంగా అయితే అక్టోబర్ నెల బాక్సాఫీస్ ఆగమాగం అయింది.