టైమ్ చూసి లాగేస్తున్న ఓటీటీ.. సంథింగ్ రాంగ్!

0

దండయాత్ర దయాగాడి దండయాత్ర!.. అంటూ టెంపర్ మెంట్ చూపించాడు యంగ్ యమ ఎన్టీఆర్. బాక్సాఫీస్ పై ఆక్రమణ దురాక్రమణ అంటే ఏమిటో చూపించాడు. అదంతా సరే కానీ .. ఇప్పుడు మరో రకం దండయాత్ర టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతోంది.

ఇన్నాళ్లు సినిమా అంటే థియేటర్ కి వెళ్లాలి అన్న వాళ్లు ఇకపై సినిమా ని ఓటీటీలోనే వీక్షించాలి! అన్నంతగా మారిపోతున్నారు. ఈ ఛేంజ్ ఊహించనిది. నెట్ ఫ్లిక్స్ .. అమెజాన్.. జీ5 .. ఆహా ఇలా ఓటీటీ లు మైండ్ సెట్ ని మార్చేస్తున్నాయనే చెప్పొచ్చు. ఇక ఇదే అదనుగా జనాలు థియేటర్స్ కి రారు అనే కాన్ఫిడెన్స్ తో ఓటీటీ వాళ్ళు మెల్లిగా ఇండస్ట్రీ ని ఆక్రమిస్తున్నారు. సెప్టెంబర్ మొదటి శుక్రవారం V సినిమాని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇది అయిన వెంటనే నిశ్శబ్దం కూడా సెప్టెంబర్ 2 లేదా 3వ వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆ తరువాత కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న `చావు కబురు చల్లగా`… సాయి తేజ్ `సోలో బ్రతుకే సో బెటర్`… నితిన్ `రంగ్ దే`.. పూరి కొడుకు ఆకాష్ నటిస్తున్న రొమాంటిక్ .. రామ్ రెడ్ వంటి సినిమాలు ఈ నాలుగు నెలల్లో ఓటీటీ బాట పట్ట బోతున్నాయి.. అంటూ హోరెత్తిపోతోంది. ఇందులో మెజారిటీ సినిమాలు అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ప్రస్తుతానికి డీల్స్ ఫైనల్ అయ్యే దశలో కొన్ని ఉండగా కొన్నిటికి ఇప్పటికే ఫినిష్ చేశారని తెలుస్తోంది. థియేటర్ల స్థానంలో ఓటీటీ ముదిరితే సంథింగ్ రాంగే. ముందుంది ఓటీటీలో అసలు పండగ .. బీ రెడీ..