ఆ దివ్యమైన ముహూర్తం ఎపుడో మోహన్ బాబు గారూ?

0

మంచు కాంపౌండ్ హీరోల కెరీర్ జర్నీ గురించి తెలిసినదే. ఇక కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు (ఎంబీ) ఇటీవల ఎందుకనో స్థబ్ధుగా ఉన్నారు. తన మనసుకు నచ్చిన పాత్ర అయితే తప్ప అతడు ఓ సినిమాకి అంగీకరించాలంటే చాలానే ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు మహానటి చిత్రంలో ఎస్వీ రంగారావు పాత్రలో నటించారు. ఆ తర్వాత మళ్లీ సూర్య సినిమా సూరారై పోట్రు (ఆకాశం నీ హద్దుగా) లో కీలక పాత్రను పోషించారు. ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. సన్ ఆఫ్ ఇండియా అనే చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించారు.

ఇక నటన సంగతి అటుంచితే.. మోహన్ బాబు త్వరలో మెగా ఫోన్ పట్టనున్నారన్నది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఎలాంటి కథను ఎంచుకున్నారు? స్క్రిప్టు లో మ్యాటర్ ఎలా ఉంటుంది? జోనర్ ఏమిటి? తదితర విషయాలేవీ ఇంకా రివీల్ కాలేదు. అయితే అతడి ప్రకటనతోనే ఎంతో బిగ్ సర్ ప్రైజ్ ఉంటుందని మాత్రం గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అందుకు ముహూర్తం ఎపుడు? అన్నది మంచు కాంపౌండ్ రివీల్ చేయాల్సి ఉంది.

ఎంబీ సొంత బ్యానర్లలో ఎన్ని సినిమాల్లో నటించినా కానీ దర్శకత్వం వహించింది లేదు. కానీ ఇప్పుడు మాత్రం సీరియస్ గానే ఉన్నారు ఈ విషయంలో. మరోవైపు మోహన్ బాబు వారసులు విష్ణు.. మనోజ్ కెరీర్ పరంగా కంబ్యాక్ కోసం అంతే సీరియస్ గా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. విష్ణు వరుసగా రెండు సినిమాల్లో నటిస్తుండగా.. మనోజ్ సొంతంగా బ్యానర్ ప్రారంభించి అందులో మొదటి సినిమాని ప్రారంభించారు.