మెగా ప్రిన్సెస్ ఇంట పెళ్లి పనులు యమ స్పీడ్!

0

గుంటూరు రేంజి ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో మెగా ప్రిన్సెస్ నిహారిక నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీలో ఎంతో ముఖ్యమైన పెళ్లి వేడుకకు సమయమాసన్నమైంది. పెళ్లికి ముందు పనులన్నీ ఇప్పటికే ఊపందుకున్నాయి. నిహారికా కొనిదెల నిన్నటిరోజున పసుపు దంపుడు కార్యక్రమం వీడియోని షేర్ చేయగా అది అభిమానుల్లో జోరుగా వైరల్ అయ్యింది.

తాజాగా మెగా షాపింగ్ కి అన్నిరకాలా ప్రిపరేషన్స్ లో ఉన్నారని తెలుస్తోంది. వివాహ వేడుక కోసం అవసరం అయిన బంగారు ఆభరణాలు.. ఖరీదైన డిజైనర్ దుస్తులు మొదలైనవి కొనడానికి షాపింగ్ కోసమే భారీ బడ్జెట్ ని కేటాయించారని తెలుస్తోంది. నిశ్చితార్థ వేడుకలో చందమామనే తలపించిన నిహారిక పెళ్లికూతురు గా డిజైనర్ లుక్ లో దేవతనే తలపించడం ఖాయం. ఇక తనకు తగ్గ వరుడు చైతన్య సినిమా హీరోనే తలపిస్తున్నాడని ఇప్పటికే ప్రశంసలు కురుస్తున్నాయి.

నిశ్చితార్థం మొదలు పసుపు కార్యక్రమం సహా ప్రతిదీ ఫోటోలు వీడియోల రూపంలో అభిమానుల ముందుకు వచ్చాయి. వీటిపై అభిమానుల్లో చర్చ సాగుతోంది. ఇక పెళ్లి తేదీని త్వరలో ప్రకటిస్తారు. వివాహానికి వేదిక ఏది? అన్నది ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇరువైపులా పెళ్లి పెద్దలు సరైన వేదిక కోసం చూస్తున్నారు. ఇది టాలీవుడ్ లోనే విలాసవంతమైన వివాహ వేడుక అవుతుందనడంలో సందేహమేం లేదు. సల్మాన్ ఖాన్ తన సోదరి అర్పిత వివాహం హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్ నుమా ప్యాలెస్ హోటల్లో వైభవంగా జరిపించారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన బేబీ కోసం ఆ రేంజులోనే వేడుక సాగాలని కోరుకుంటున్నాడా? అన్నది చూడాలి.