జయప్రకాష్ రెడ్డి తనయుడికి కరోనా పాజిటివ్.. అంత్యక్రియలకు దూరం

0

ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి మృతి సినీ పరిశ్రమకు పెద్ద షాకింగ్ వార్త అయ్యింది. మొన్నటి వరకు కూడా షూటింగ్ లో పాల్గొన్న ఆయన హఠాత్తుగా గుండె పోటుతో మృతి చెందడం సినీ పరిశ్రమ వారికి శోకం మిగిల్చింది. కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో మునిగి పోయారు. ఈ సమయంలో మరో విచారకర వార్త ఏంటీ అంటే ఆయన కుమారుడు మరియు కోడలు కరోనా కారణంగా గుంటూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది ఇటీవలే కనుక వారు అంత్యక్రియలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.

కుమారుడు లేకుండానే బంధు మిత్రులు గుంటూరులో జేపీ అంత్యక్రియలకు సిద్దం చేశారు. కొడుకుగా తండ్రి చివరి కార్యక్రమాలు నిర్వహించలేక పోతున్నందుకు జేపీ తనయుడు తీవ్ర మనస్థాపంకు గురయ్యాడంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో కాలింగ్ ద్వారా జేపీ తనయుడు తండ్రిని చూసి కన్నీరు మున్నీరు అయ్యాడు అంటూ కుటుంబ సభ్యులు తెలియజేశారు. జేపీ మృతితో సినీ ప్రముఖులు కూడా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా ఆయన్ను చివరి సారి చూడలేక పోతున్నందుకు చాలా బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.