అన్ లాక్ లో తెలుగమ్మాయి దుమారం

0

బిగ్ బాస్ ఫేం నందిని రాయ్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఇటీవల వెండితెర బుల్లితెర సహా ఓటీటీ వేదికలపైనా తళుకుబెళుకులు ప్రదర్శిస్తోంది. ఇటీవలే రిలీజైన `మెట్రో కథలు` ఓటీటీ (ఆహా-తెలుగు) సినిమాలో బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ గా నటించిన నందిని చక్కని ఆహార్యంతో ఆకట్టుకుంది. ఇన్ వోర్ అందాలతో నందిని ఎలాంటి బిడియం లేకుండా నటించడం హాట్ టాపిక్ అయ్యింది.

ఇక గత కొంతకాలంగా తెలుగమ్మాయి నందిని రాయ్ ఇన్ స్టా మాధ్యమంలో వరుస ఫోటోషూట్లతో అంతకంతకు అగ్గి రాజేస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకూ వైట్ ఇన్ వోర్… డెనిమ్ జీన్స్ లో నందిని రాయ్ ఇచ్చిన ఫోజు సంచలనంగా మారింది. “నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఎలా ప్రవర్తిస్తావో నీ యాటిట్యూడ్ చెబుతుంది. మైండ్ కి యాటిట్యూడ్ మిర్రర్ లాంటిది“ అంటూ తన ఇన్ సైడ్ మ్యాటర్ ని రివీల్ చేసింది.

తాజాగా మరో వేడెక్కించే ఫోటోని నందిని రాయ్ షేర్ చేసింది. ఇందులో మరింత హాట్ గా దర్శనమిచ్చింది ఈ తెలుగమ్మాయి.. తను చెప్పినట్టే నటించేందుకు లేదా గ్లామర్ ఎలివేషన్ లో తనకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవని మేకర్స్ కి ఫీలర్స్ వదులుతోంది ఫోటోల రూపంలో. ఇక నందిని రాయ్ ఇటీవల ఇరుగు పొరుగు భాషల్లోనూ అవకాశాలు అందుకుంటోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగులోనూ మరిన్ని చిత్రాలకు సంతకాలు చేయనుందని తెలుస్తోంది. అన్ లాక్ 4.0 లో చెలరేగుతూ ఇలా వరుస ఆఫర్లు పట్టేయడం ఆసక్తికరమే.