సర్కారు వారి పాట అమెరికా షెడ్యూల్ లాక్

0

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత నెలలో ఈ సినిమా కోసం లొకేషన్స్ ను చూసేందుకు అమెరికా వెళ్లారు. అక్కడ పలు చోట్ల తిరిగిన దర్శకుడు పరశురామ్ మరియు ఇతర యూనిట్ సభ్యులు తమ కథకు సూట్ అయ్యే లొకేషన్స్ ను ఎంపిక చేశారట. వచ్చే నెలలో అమెరికాలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత సర్కారు వారి పాట సినిమా యూనిట్ సభ్యులు అమెరికాకు వెళ్లబోతున్నారట.

అమెరికాలో దాదాపు 45 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుని జనవరి లో ఇండియాకు రాబోతున్నారు. అమెరికాలో సింగిల్ షెడ్యూల్ తో మెజార్టీ పార్ట్ ను పూర్తి చేసి బ్యాలన్స్ వర్క్ ను ఇండియాలో సమ్మర్ వరకు పూర్తి చేసే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారట. ఈ విషయంలో దర్శకుడు పరశురామ్ చాలా క్లీయర్ గా ఉన్నాడు. బడ్జెట్ ను తగ్గించేందుకు గాను తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాను కూడా చాలా తక్కువ సమయంలోనే అనీల్ రావిపూడి పూర్తి చేశారు. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాను కూడా తక్కువ సమయంలోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో ఉన్నారట.