ట్రంప్ తో పవన్ కూతురు

0

సోషల్ మీడియాలో స్టార్స్ కూతుర్ల సందడి కొనసాగుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హా లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య మాత్రం చాలా తక్కువగా కనిపిస్తు ఉంటుంది. పవన్.. రేణు దేశాయ్ లు విడిపోయిన సమయంలో ఆద్య చిన్న పాప. ఇప్పుడు ఆద్య పెరిగి పోతుంది. అమ్మ రేణు దేశాయ్ వద్ద ఉంటున్న ఆద్య చాలా అరుదుగా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. ఒక వేళ సోషల్ మీడియాలో ఆద్య ఫొటో షేర్ చేసినా కూడా ఏదో ఒక ఫిల్టర్ చేయడం లేదంటే గ్రూప్ లో ఉంటం జరుగుతుంది. కాని మొదటి సారి ఆద్య ట్రంప్ తో దిగిన ఫొటోను రేణు దేశాయ్ షేర్ చేసింది.

ఇప్పటి వరకు నేను చూడని సున్నితమైన స్వీట్ కుక్క ట్రంప్. అయితే ఈ ట్రంప్ ఆ ట్రంప్ కాదంటూ ఫన్నీగా కామెంట్ పెట్టి ఆధ్య ఫొటోను షేర్ చేసింది. పొడవు హైట్ దిట్టంగా ఉన్న కుక్క ట్రంప్ వద్ద ఆధ్య నిల్చుని ఫొటోకు ఫోజ్ ఇచ్చింది. ఈ కుక్కకు ఆద్య ఫిదా అయ్యిందని రేణు దేశాయ్ పేర్కొంది. కుక్క ట్రంప్ పక్కన నిల్చున్న ఆధ్య ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు కుక్కను కట్ చేసి ఆధ్య ఫొటోను తమ గ్యాలరీలో షేక్ చేసుకున్నారు.. మరికొందరు షేర్ చేస్తున్నారు. పవన్ పోలికలు కనిపిస్తున్న ఆద్య మద్దుగా ఉందంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.