Templates by BIGtheme NET
Home >> Cinema News >> పవర్ స్టార్ ని ఢీ కొట్టనున్న భల్లాలదేవుడు..!

పవర్ స్టార్ ని ఢీ కొట్టనున్న భల్లాలదేవుడు..!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇది మలయాళ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకు తెలుగు రీమేక్ అని తెలుస్తోంది. పృథ్వీరాజ్ స్వీయ దర్శకత్వంలో బిజూ మీనన్ – పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్కడ ఘన విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో బిజూ మీనన్ పోషించిన శక్తిమంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనున్నాడు. ఇక తెలుగులో పృథ్వీరాజ్ రోల్ ఎవరు పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో హ్యాండ్సమ్ హంక్ దగ్గుబాటి రానా పవన్ కళ్యాణ్ కి ధీటుగా నిలిచే పాత్రలో నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి భల్లాలదేవుడుని ఆహ్వానిస్తూ చిత్ర యూనిట్ ఓ వీడియో రిలీజ్ చేసింది. పవర్ స్టార్ తో మ్యాచో మ్యాన్ జాయిన్ అవుతున్నట్లు ఇందులో పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఇగోల కారణంగా వాళ్ళ జీవితాల్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ధీటుగా నిలబడే పాత్రల్లో పవన్ – రానా కనిపించనున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. థమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేయనున్నారు.