పవన్ త్రివిక్రమ్ మూవీ అదొక్కటే అడ్డు!

0

పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ ల కాంబోలో ఇప్పటి వరకు జల్సా.. అత్తారింటికి దారేది.. అజ్ఞాతవాసి సినిమాలు వచ్చాయి. మొదటి మూడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అత్తారింటికి దారేది సినిమా ఆ సమయంలో ఇండస్ట్రీ హిట్ దక్కించుకుంది. అజ్ఞాతవాసి సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దుగా పెట్టుకుంటే సినిమాతో తీవ్రంగా నిరాశ పర్చారు. అట్టర్ ఫ్లాప్ తెచ్చుకున్న అజ్ఞాతవాసి తర్వాత కూడా వీరిద్దరి కాంబో మూవీ గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండుమూడు కథలు వీరిద్దరి కాంబో కోసం రెడీగా ఉన్నాయి. ఆ కథలపై త్రివిక్రమ్ మరియు పవన్ లు చర్చించారు.

పవన్ ఎప్పుడు అంటే అప్పుడు త్రివిక్రమ్ రెడీగా ఉన్నాడట. కాని పవన్ ఇప్పుడు నాలుగు సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు తక్కువ బడ్జెట్ తో చేయాలనే ఉద్దేశ్యంతో ఆ నాలుగు సినిమాలకు పవన్ కమిట్ అయ్యాడు. ఈ నాలుగు సినిమాల్లో దాదాపు అన్ని కూడా మూడు నాలుగు నెలలకు ఒక్కటి చొప్పున పూర్తి చేయాలని దర్శకులకు ఇప్పటికే పవన్ ఆదేశించారు. పవన్ వచ్చే రెండు ఏళ్లు ఆ నాలుగు సినిమాలతో బిజీగా మారబోతున్నాడు. మరో ఒకటి రెండు సినిమాలు కూడా చిన్న బడ్జెట్ తో తక్కువ సమయంలో చేయవచ్చు.

త్రివిక్రమ్ తో మూవీ అంటే కనీసం ఆరు నెలల నుండి ఎనిమిది నెలల సమయం కావాల్సి ఉంటుంది. కనుక వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత అప్పుడు వచ్చే ఫలితాన్ని బట్టి త్రివిక్రమ్ తో మూవీని చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ మరియు పవన్ లు ఇద్దరు కూడా వేరు వేరు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాదిలో పవన్ రెండు లేదా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ మూవీని విడుదల చేసే అవకాశం ఉంది అంటున్నారు.