హైద్రాబాద్ తెలియాలి అంటే ఛాయ్ బిస్కెట్ అండ్ సమోసా తెలియాలి.. అవి తెలిస్తే చాలు.. కాదు వాటికి మించి తెలియాలి ఇవి తెలియాలి లేదా తెలిసిన వారిని వెతకాలి.. ఈ పండుగ రోజు హైద్రాబాద్ తో పాటు ఇంకొన్నీ తెలియాలి.. తెలుసుకోవడం అనడంలో ఉన్నంత ఉన్నతి ఎందులోనూ లేదు అనుకోవడం ఇప్పుడు బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ.. పవన్ గురించి తెలుసుకుంటూ .. ఇంకాస్త వివరిస్తూ.. ఈ పవన్ పండుగ రోజు రాస్తున్నానొక ప్రత్యేక కథనం.
“మనుషులంతా ఒక్కటంది శాస్త్రమన్నా మనుషుల్లో సైతానుకిది పట్టదన్నా ఎన్నడు పట్టదన్నా..” ఈమాటే అతనిని ఎన్నడూ కదిలిస్తుంది.. ఆ పాటే మాస్టార్జీనీ ఇంకా ఇంకొందరినీ,.. ఓ స్థాయికి తీసుకు వెళ్లింది. ఇష్టంగా రాసుకున్న కథ ఫ్లాప్ .. ఇష్టం పెంచుకున్న సినిమా ఫ్లాప్.. కథకుడి ఫ్లాప్ అయినా సినిమా ఫ్లాప్
అయినా యాక్టర్ స్టార్ డమ్ మారడం లేదు కానీ .. అతడు తనే చెప్పుకున్న విధంగా చెప్పుకోదగ్గ యాక్టర్ కానే కాదు కానీ ఎందుకీ క్రేజ్.. అందుకే అంటాడు ఇది అన్నయ్య భిక్ష అని..!
ఈ పాటి అంగీకారం ఆయనలో ఉంది,.. ఉంటుంది మీరూ మీరూ తన్నుకోకండి.. మాకూ మాకూ ఏవిభేదాలూ లేవుఅని చెప్పగలిగే స్థిరత కూడా ఉంది… ఇంకా భీమవరం పోలీస్ స్టేషన్ కు తన వంతుగా పరిహారం చెల్లించిన దాఖలా ఉంది.. ఇవి చాలు పవన్ అంటే.. ఏంటో కాస్త అర్థం అయ్యేందుకు..
థియేటర్ నుంచి థియేటర్ వరకూ.. అనగా.. ఏయూ నుంచి ఇంకాస్త ముందుకుపోయి జగదాంబ వరకూ.. లేదా ఇంకెక్కడి వరకో! నటన అన్నది చేయాల్సిన పని కాదు.. చేయకూడని పని అని తోచినప్పుడు.. కూడా! ఈ నటన వదలడం కుదరని పని! ట్రిక్ అం డ్ ట్రికీ అంటే ఇదే! లేదా మరొకటో ఇంకొకటో కూడా ఇదే! పవన్ మీకు నచ్చుతాడా! ఎందుకు అన్న ప్రశ్న నుంచి ఎందాక అన్న ప్రశ్న వరకూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ రాస్తున్నా..
వర్తమానం లేని భవిష్యత్ లేదు.. ప్రత్యుత్తర రూపంలో మన జీవితం ఎన్నడూ ప్రహేళికే.. అందుకే దుఃఖం చివరి అంచుల్లో ఉన్నప్పుడు కల్లోలితాలే అంత్య కాల అవస్థలను గు ర్తు చేస్తాయి అని రాశాను. అననీయండి అది వాళ్ల సంస్కారం.. అనేవాళ్లను ఆపడంలో అర్థం లేదు ఆంతర్యం ఏంటన్నది గమనిస్తే చాలు అని అంటారాయన.. అందుకనో ఎందుకనో ఇప్పటికీ ఎప్పటికీ కొందరికే కొంతవరకే పవన్ నచ్చుతాడు.. ఆ కోవలో ఆ తోవ లో కొణెదల వారింటి చిన్నబ్బాయి ఉంటాడు.
ఈ కార్యక్రమానికి ఆయన రాలేదు.. ఈయన ఈ కార్యక్రమంలో లేనే లేడు.. మొదట చివర వినిపించే మాటలు అన్ని అర్థవంతమ యినవేనా అన్నది సందిగ్ధం. సందేహం కూడా! పవన్ నుంచి కొన్ని నేర్చుకోవాలంటే ఏం నేర్చుకుంటారు అని ఓ చిత్రకారుడ్ని అడిగాను.,. తొలి రోజుల్లో ఉండే తపనే అత్యంత ఉత్తమోత్తమం అని చెప్పారాయన.. ఓ పోస్టర్ డిజైనర్ ను అడిగా కేవలం మేనరిజ మ్స్ తో మాత్రమే మెస్మరైజ్ చేయగల నటుడు ఆయన అని తెలిపారాయన.. పవన్ ..డైరక్టర్స్ ఆర్టిస్టు కాదు.. పవన్.. స్క్రిప్ట్ డి మాండ్ మేరకు నటించేంత సినిమాలేవీ ఇందాక చేయలేదు.. చేస్తే ఆ మూడు సినిమాలే మాట్లాడతాయి అని చెప్పారా చిత్రకారులు.. ఆర్టిస్టును పోలిన ఆర్టిస్టు సినిమాను పోలిన సినిమా కానీ చిరును పోలిన పవన్ అన్నదే తప్పు.. (నటన వరకూ) అంటూ వివరించారాయన.
ఫెర్ఫార్మర్ .. ఎంటర్ టైనర్..
పవన్.. ఏమయినా కావొచ్చు.. ఇంకాస్త స్క్రిప్టు పై వర్క్ చేసే డైరెక్టర్లు దొరికితే.. ఊసుపోని మాటలతో చెప్పడం కాకుండా ఏమయి నా కొత్తగా చెప్పించే ప్రయత్నం చేస్తే.. కానీ పవన్ సినిమాలకు ఆ స్కోప్ ఉందో లేదో అన్నది వెతకాలి.. బాక్సాఫీసు కాసులనే న మ్ముతుంది.. క్యారెక్టర్లు వచ్చిపోతాయి.. కాసులు కూడా వచ్చిపోతాయి.. పవన్ క్యారెక్టర్ కొన్ని సార్లు భలే నచ్చిన సందర్భాలే ఆ.. రైటర్ మాస్టార్జీకి లైఫ్ ఇవ్వడం.. లేదా కొరియొగ్రఫర్ గణేశ్ మాస్టర్ కు లైఫ్ ఇవ్వడం.. ఇంకా ఇంకొందరికి.. పవన్ ఇంకొంత నచ్చు తాడు..ఆ నచ్చే క్రమంలో సాయం, ఆ నచ్చే క్రమంలో కొన్ని అయినా తాను అనుకున్నవి చేయడం లేదా చేయించగలగడం వీటి లో నచ్చుతాడు.. అలా మాస్టార్జీ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చోటు నచ్చాడు. కొన్ని ఆపదల వేళ అన్నీ తానయితే మిక్కిలి సంతోషంగా నచ్చాడు..ఆ కొందరే పవన్ పేరు చెప్పరు అని అంటారు కొందరు..అయినా తప్పు అవన్నీ పట్టించుకోకూడదు అని చెబుతాడు పవన్..
ఛలోమియా చాదర్ ఘట్…
ఎందుకు అన్నాను హైద్రాబాద్ ఎందుకు తెలియాలి అన్నాను అంటే.. జానీ టైటిల్ సాంగ్ రాయించే క్రమంలో ఆయనతో పనిచేసిన మాస్టార్జీ చెప్పిన మాటలు గుర్తుకువచ్చి అన్నాను.. ఆయన ఇంట్రావర్టా
లేదా ఎక్స్ ట్రా వర్టా ఇలాంటి ప్రశ్నలు పనిలేని వాళ్లు ప్రశ్నిస్తారు.. అవేవీ అవసరం అయినా కాకున్నా.. ఇండస్ట్రీలో ఆయన పేరిట కొన్ని కుటుంబాలు నిలదొక్కుకున్నాయి అన్నది నిజం..
ఫ్రేమ్ ఇన్ ఫ్రేమ్ ఔట్
ఏది ఎంత వరకూ ఆయన సినిమాల్లో ఫ్రేమ్ ఇన్ కూడా కొన్నిసార్లు అస్తవ్యస్తంగానే ఉంటుంది. ఎవరో అన్నట్లు దిగువ స్థాయి కథలతో కొన్ని సినిమాలు కొందరు ఆయనతో చేయించారు అది కరెక్టు కాదు కూడా!
కొన్ని అతి ప్రేమతో చేసినా అవి కూడా వర్కౌట్ కాలేదు. అయినా ఇవాళ పవన్ కొన్ని సినిమాలకు మార్కెట్ వాల్యూ పెంచాడు.. లేదా పెంచేందుకు చేసిన కృషిలో తానూ భాగం అయ్యాడు.
ఇంతవరకూ పవన్ నచ్చుతాడు.. అసలు అర్థపర్థం లేని కథలు తెచ్చి ఆయనతో చేయించిన నిర్మాతలూ .. లేదా దర్శకులు నేర్చుకోవాల్సినంత నేర్చుకుంటే పవన్ డైరక్టర్స్ యాక్టర్ అవుతాడు..ఇప్పటికయితే కాదు ఇది మాత్రమే ఒప్పుకోవాలి. యాక్టర్స్ యాక్టర్ అంత కన్నా కాదు ఎక్స్ ట్రీమ్ క్లోజప్స్ లో ఆయనను అర్థం చేసుకోవాలంటే కొన్నింట ఆయన నమ్మిందినిరూపించి, సినిమా పాటకూ, ఫైట్ కూ కొన్ని కొత్త దారులు వేయాలన్న ఆలోచనకు దారి ఇచ్చాడు. సింపుల్ లైన్ తో సినిమాలు చేసి కూడా హిట్లు కొట్టొచ్చు అని కూడా నిరూపించాడు.. స్టార్ హీరోల సినిమాల కథల్లో లాజిక్కులు వెతక్కడం మానుకోండి
అని మాటకు అందరి స్టార్ హీరోల్లానే తలొగ్గాడు.. ఇవికాక ఇవి మినహాయిస్తే పవన్.. కొన్నింట నచ్చుతాడు,.. భజన నమ్మడు,.. ఒప్పుకోడు.. ఇంతవరకూ నచ్చుతాడు..ఇక రాజకీయాల ప్రస్తావన గురించి చెప్పను గాక చెప్పను.. ఇవి ఇక్కడ ప్రస్తావనార్హాలు. ఎనీవే డియర్ పవన్ సర్ .. హ్యాపీ బర్త్ డే .. ఇంకా మీ గురించి తెల్సుకునే ప్రయత్నంలో.. మీ అభిమానులతో పాటూ నేనూ..
– రత్నకిశోర్ శంభుమహంతి
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
