ఈశ్వర పరమేశ్వర పవన్ ఈశ్వర.. ఎప్పుడు నీకు మరోసారి అభిషేకం చేసే అదృష్టం..

0

పురుషులందు పుణ్య పురుషులు వేరు ఎలాగో.. పవన్ భక్తులందు బండ్ల గణేష్ వేరయా అనే చెప్పాలి. ఆయనంటే నాకు దైవం సార్.. నా దేవుడు.. నా పిచ్చి.. నా ప్రాణం ఆయనే సార్.. ఆయన గురించి ఏం చెప్పమంటారు’ అంటూనే మైక్ పుచ్చుకున్నారంటే తన దేవుడు పవన్ కళ్యాణ్ గురించి పొగడ్తల వర్షం కురిపించే బండ్ల గణేష్.. పవన్ బర్త్ డే సందర్భంగా ట్వీట్ వార్ ప్రకటించారు. నిన్నటి నుంచి ట్వీట్లు, రీట్వీట్లు చేస్తూ తన దేవుడికి బర్త్ డే భక్తి చాటుతున్నారు.

ఈశ్వర పరమేశ్వర పవన్ ఈశ్వర.. ఎప్పుడు నీకు మరోసారి అభిషేకం చేసే అదృష్టం అందుకో జన్మదిన శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు బండ్ల గణేష్. అంతేకాదు.. పవన్ ఫ్యాన్స్ వీరిద్దర్నీ ఉద్దేశించి చేస్తున్న ట్వీట్లను రీ ట్వీట్స్ చేస్తూ తన దేవుడిపై ఉన్న భక్తిని ట్విట్టర్ వేదికగా మరోసారి చాటుతున్నారు బండ్ల గణేష్.

పవన్ కళ్యాణ్‌తో తీన్మార్, గబ్బర్ సింగ్ సినిమాలు చేసిన బండ్ల గణేష్.. ఆయనతో కలిసి హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు ఇటీవల ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తీన్మార్‌ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో.. బండ్ల గణేష్‌కి పిలిచి మరీ ‘గబ్బర్ సింగ్’ అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్. అప్పటి నుంచి విధేయత చూపిస్తూ.. పవన్‌కి భక్తుడిగా మారారు బండ్ల గణేష్.