Templates by BIGtheme NET
Home >> Telugu News >> వర్క్ ఫ్రమ్ హోంతో రూ.10000 2గం. ఆదా ..కానీ అదే ప్రాబ్లమ్ !

వర్క్ ఫ్రమ్ హోంతో రూ.10000 2గం. ఆదా ..కానీ అదే ప్రాబ్లమ్ !


కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవన విషయాల్లో అనేక మార్పులు సంభవించాయి. ముఖ్యంగా ఐటీ రంగం నుండి వివిధ రంగాలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసాయి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల సగటు భారతీయుడికి చాలా వరకు సమయం డబ్బు ఆదా అవుతుందని తాజాగా ఓ సర్వే లో వెల్లడైంది. ఈ మేరకు ప్రముఖ కో-వర్కింగ్ స్పేస్ ప్రొవైడర్ awfis సర్వేలో ఈ మేరకు ఆదా అయిందనే అంశంపై సర్వే నిర్వహించింది. ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో ఇప్పుడు మీరు చూడండి..

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే .. సగటు ఓ భారతీయ ఉద్యోగి నెలకు దాదాపు రూ.5520ను ఆదా చేస్తున్నారు. డబ్బుతో పాటు నెలకు సగటున గం.1.47 నిమిషాల సమయాన్ని కూడా ఆదా చేస్తున్నాడని ఆ సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా ఆఫీస్ కి వెళ్లే సమయం తప్పింది. ఇంటి నుండే పని వల్ల ప్రయాణ సమయం లేకపోవడంతో దాదాపు రెండు గంటలు మిగులుతుంది. గతంలో ఎక్కువగా సమయం ఆఫీస్ కి వెళ్ళడానికే సరిపోయేది. సర్వేలో పాల్గొన్నవారిలో 74 శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా తాము నెలకు రూ.5000 నుండి రూ.10000 ఆదా చేస్తున్నామని 20 శాతం మంది చెప్పగా రూ.10000కు పైన ఆదా చేస్తున్నామని 19 శాతం మంది చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల దాదాపు ప్రయాణం లేకుండా పోయింది. 40 శాతం మంది ఉద్యోగులు ప్రయాణం తగ్గినట్లు తెలిపారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఏడాదికి సగటు భారతీయుడు ఆదా చేసే సమయం దాదాపు 44 రోజులుగా ఉంటుందని awfis వ్యవస్థాపకులు సీఈవో అమిత్ రమణి వెల్లడించారు. ఏడాదికి దాదాపు 44 రోజులు అంటే 100 మంది ఉద్యోగులు ఉన్న ఓ సంస్థకు 18 పూర్తి రోజులతో సమానం. అంటే కంపెనీలకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా వీరిని ఉపయోగించుకుంటే ఈ మేరకు ఖర్చు తప్పి ప్రయోజనం పెరుగుతుందని ఒక ఉద్యోగి సగటున రోజుకు 8 గంటలు వర్క్ చేస్తాడు అని తెలిపాడు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కొంతమంది ఉద్యోగులు సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 27 శాతం మంది ఒంటరితనాన్ని 23 శాతం మంది వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పరంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కొన్ని కంపెనీలు ఇప్పటికీ టెక్నికల్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనివార్యం. కాబట్టి ఈ దిశగా అడాప్ట్ అవుతున్నారు. వచ్చే అయిదేళ్లలో ఇంటి నుండి పని పెరుగుతుందని అమిత్ రమణి అన్నారు. 43 శాతం మంది వర్క్-లైఫ్ ను బ్యాలెన్స్ చేయలేకపోతున్నందున రిమోట్ వర్కింగ్ విషయంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కు సంబంధించి విధానాలు రూపొందించుకోవాలని తెలిపారు. ఇకపోతే ఈ సర్వేను దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 1000 మంది ఉద్యోగులతో నిర్వహించారు. వివిధ రంగాల్లోని ఉద్యోగుల నుండి సమాచారం సేకరించారు. ఈ సర్వే ప్రకారం 75 శాతం కంటే ఎక్కువమంది ఉద్యోగులు తమ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారు.