ఓటీటీ రిలీజ్ పై హీరో అసంతృప్తి…?

0

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ‘నో పెళ్లి’ వీడియో సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘హే ఇది నేనేనా..’ అనే మరో సాంగ్ ఇటీవల రిలీజ్ చేశారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ఐదు నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి ఓటీటీలో రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.

కాగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీని సమ్మర్ లో సోలోగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు.. కానీ కరోనా కారణంగా కుదరలేదు. కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతుండటంతో థియేటర్స్ ఇప్పట్లో తెరిచేలా కనిపించడం లేదు. దీంతో సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ క్రమంలో దిల్ రాజు ప్రొడక్షన్ లో నాని – సుధీర్ బాబు హీరోలుగా నటించిన ”వి” సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ మేకర్స్ కూడా అదే దారిలో ఆన్లైన్ లో రిలీజ్ కి రెడీ చేస్తున్నారని.. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘జీ 5 ఒరిజినల్’లో స్ట్రీమింగ్ కాబోతోందని ఓటీటీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే ఈ నిర్ణయంపై సాయి ధరమ్ తేజ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం క్రైసిస్ లో ప్రొడ్యూసర్స్ పరిస్థితిని అర్థం చేసుకొని సాయి ధరమ్ తేజ్ తన సినిమాని ఓటీటీ విడుదల చేయడానికి ఒప్పుకున్నాడట. కాకపోతే ‘సోలో బ్రతుకే’ ని తెలుగులో అంతగా క్రేజ్ లేని జీ5 ఓటీటీలో రిలీజ్ చేయడం పైన మాత్రం తేజ్ అసంతృప్తిగా ఉన్నాడట. ప్రెజెంట్ వ్యూయర్ షిప్ లో ముందున్న అమెజాన్ ప్రైమ్ లేదా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తన సినిమాని రిలీజ్ చేయాలని తేజ్ మేకర్స్ కి సూచిస్తున్నాడట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.