మహేష్ భట్ పై ఆ హీరోయిన్ ట్వీట్…వైరల్

0

బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లిన తర్వాత దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటోన్న సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి అమె సోదరుడు తల్లిదండ్రులను సీబీఐ అధికారులు విచారణ జరిపారు. ఇక సుశాంత్ రియాల మధ్య బ్రేకప్ జరగడానికి బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ కారణమని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. రియా మహేష్ భట్ మధ్య జరిగిన వాట్సప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఆరోపణలకు ఈ సంభాషణ బలం చేకూర్చినట్లయింది. రియాకు మహేష్ భట్ `షుగర్ డాడీ` అని రియా తండ్రి ఇంద్రజిత్ మహేష్ భట్ లు సుశాంత్ హత్యకు ప్లాన్ చేశారని సుశాంత్ జిమ్ పార్ట్ నర్ సునీల్ కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా మహేష్ భట్ పై సీనియర్ హీరోయిన్ సుచిత్ర కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ కేసులో మహేష్ భట్ను ప్రశ్నించేందుకు సీబీఐ సమన్లు పంపిందా? అని సుచిత్ర చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

జూన్ 8వ తేదీన సుశాంత్ను విడిచి పెట్టి రియా ఎందుకు వెళ్లిందని సుచిత్ర ట్వీట్ చేశారు. రియా- మహేష్ మధ్య ఉన్న బంధం ఏమిటి అన్న విధంగా పరోక్షంగా సుచిత్ర చేసిన ట్వీట్ పై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. జూన్ 8న సుశాంత్ ప్లాట్ నుంచి రియా వెళ్లిన తర్వాత….రియా మహేష్ భట్ ల మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీకైంది. ఇక వెనకకు తిరిగి గతంలో జరిగిన విషయాలు చూసుకోకు అని రియాతో మహేష్ భట్ అన్నారు. నీ నిర్ణయంపై నీ తండ్రి ఖుపీగా ఫీలవుతారు..ఆయనకు నా ధన్యవాదాలు తెలియజేయండి అంటూ మహేష్ భట్ మెసేజ్ పంపారు. దీంతో రియా సుశాంత్ ల బ్రేకప్ కు మహేష్ భట్ కారణమన్న పుకార్లు సోషల్ మీడియాలో వచ్చాయి. ఇక సుశాంత్ మరణానికి ముందు మహేష్ భట్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సుశాంత్ డిప్రెషన్లో ఉన్నారని ఆయన కూడా బాలీవుడ్ నటి పర్విన్ బాబీ మాదిరిగానే అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తాడనే విధంగా మహేష్ భట్ కామెంట్లు చేయడం వివాదాస్పదమైంది. మరి సుచిత్ర ట్వీట్లు చేసినట్లుగా మహేష్ భట్ ను సీబీఐ విచారణ జరుపుతుందా లేదా అన్నది వేచి చూడాలి.