పీకే29 ఓన్లీ ఎంటర్ టైన్మెంట్

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే రెండేళ్లలో బ్యాక్ టు బ్యాక్ అయిదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వాటిలో నాలుగు సినిమాలు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యాయి. మొదటిది వకీల్ సాబ్ ఇది షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది. వచ్చే ఏడాదిలో క్రిష్ మూవీ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించబోతున్నాడు. పవన్ ఈ మూడు సినిమాల తర్వాత తన 29వ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. తాజాగా పీకే 29 నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అజ్ఞాత వాసి తర్వాత బాబీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గారు మా బ్యానర్ లో ఒక సినిమాను చేయాల్సి ఉంది. కాని ఎన్నికల హడావుడి కారణంగా ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు తప్పిన మూవీ మళ్లీ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తో నిర్మించే అవకాశం వచ్చిందన్నారు. ఈ సినిమా పూర్తిగా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని ఇందులో ఎలాంటి వివాదాస్పద అంశాలు ఉండబోవడం లేదని ఆయన పేర్కొన్నాడు.

సినిమా పూర్తిగా వినోదాత్మకంగా సాగుతుంది. బన్నీ రేసు గుర్రం సినిమాను సురేందర్ రెడ్డి ఎలా చేశారో పవన్ తో మూవీని కూడా ఆయన అలాగే చిత్రీకరించబోతున్నారు అంటూ నిర్మాత రామ్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది చివరి వరకు పవన్ ఈ మూవీకి డేట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో సురేందర్ రెడ్డి అక్కినేని హీరో అఖిల్ తో ఒక సినిమాను పూర్తి చేయబోతున్నాడు.