బిగ్ బాస్ స్టార్ కు కరోనా పాజిటివ్

0

వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కరోనా భయపెడుతూనే ఉంది. సెలబ్రెటీలు ఎంత జాగ్రత్తగా ఉంటున్నా కూడా వారికి కూడా కరోనా నిర్థారణ అవుతుంది. ఇప్పటికే బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు ఎంతో మంది కరోనా బారిన పడ్డారు. ఎక్కువ శాతం మంది కరోనాను జయించగా కొందరు మాత్రం మృతి చెందుతున్నారు. మృతి చెందిన వారిలో వయసు పైబడ్డ వారు అధికంగా ఉన్నారు. ప్రస్తుతం కూడా పలువురు సినీ ప్రముఖులు బుల్లి తెర వర్గాల వారు కరోనా సోకడంతో చికిత్స పొందుతున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 13 ఫేం హిమాంశు ఖురానా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. బిగ్ బాస్ తో ఉత్తరాదిన మంచి గుర్తింపు దక్కించుకున్న ఈమె తనకు కరోనా పాజిటివ్ అంటూ సోషల్ మీడియా లో ప్రకటించింది.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు బిల్లులకు వ్యతిరేకంగా ముంబయిలో జరిగిన ఆందోళనల్లో ఆమె పాల్గొన్నారు. రైతు సంఘాల వారికి ఆమె మద్దతు తెలిపారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో హిమాంశు పూర్తి జాగ్రత్తలు తీసుకుందట. అయినా కూడా కరోనా వచ్చిందంటూ పేర్కొంది. అందుకే ఆ సమయంలో తనతో కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం లక్షణాలు ఉన్నా పరీక్షలు చేయించుకోవాంటూ సూచించింది. ప్రభుత్వం ఈ సమయంలో ఆందోళనలు వద్దంటున్నా కూడా కొందరు ఆందోళనలు నిర్వహిస్తూ వైరస్ ను విస్తరింపజేస్తున్నారు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.