ఆమె కళ్లలో కసి కనిపిస్తుంది

0

ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. కాని అవి అంతగా ఆకట్టుకోలేదు. కాని ఈమె తాజాగా చేసిన అనగనగా ఓ అతిథి సినిమాలో ఈమె లుక్ మరోసారి ఆర్ఎక్స్ 100 లో పాత్ర తరహాలో ఉంది అంటూ టాక్ వస్తుంది. ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి. పీరియాడిక్ విలేజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో పాయల్ ఒక పల్లెటూరు అమ్మాయిగా చీర కట్టులో కనిపిస్తుంది.

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో పాయల్ లుక్ రోజు రోజుకు సినిమాపై అంచనాలు పెంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈనెల 20వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుండి మరో స్టిల్ వచ్చింది. చేతిలో కొడవలి పట్టుకుని కసిగా చూస్తున్న పాయల్ మరోసారి ట్రెండ్ అవుతుంది. హాట్ గా నే కాకుండా ఇలా కసి కళ్లతో కూడా పాయల్ వావ్ అనిపించేలా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాతో సక్సెస్ దక్కించుకుంటే పాయల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు మరిన్ని వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.