టీవీ9 దేవి గురించి గూగుల్

0

People searching Google about TV9 Devi`s ex-husbandబిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో టీవీ 9 నుండి జాఫర్ మరియు సీజన్ 3 లో దీప్తి లు టీవీ 9 నుండి ఎంటర్ అయ్యారు. నిన్న సీజన్ 4 ప్రారంభం అయ్యింది. ఈసారి కూడా టీవీ9 నుండి ఒకరికి ఛాన్స్ దక్కింది. ఆ ఒక్కరు ప్రముఖ న్యూస్ ప్రజెంటర్ జర్నలిస్ట్ దేవి నాగవళ్లి. చాలా విభిన్నమైన బాడీలాంగ్వేజ్ రూపం మరియు డ్రసింగ్ విషయంలో కూడా విభిన్నంగా కనిపించే ఈమె గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరేమో. అంతగా పాపులారిటీ దక్కించుకున్న దేవి నాగవళ్లి ఇప్పటి వరకు లేడీ బిగ్ బాస్ విన్నర్ లేదు. కనుక తాను లేడీ బిగ్ బాస్ విన్నర్ అవుతాను అంటూ ముందుకు వచ్చింది.

షోలోకి ఎంటర్ అయ్యే సమయంలో ఈమె తన ఏవీలో మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నట్లుగా పేర్కొంది. అమెరికాకు చెందిన వ్యక్తిని ఈమె పెళ్లి చేసుకోవడం అక్కడకు వెళ్లడం అక్కడ కొన్నాళ్ల పాటు టీవీ 9 కోసం వర్క్ చేయడం కూడా చేసింది. అయితే కారణం ఏంటో కాని మళ్లీ హైదరాబాద్ కు వచ్చి డ్యూటీ చేస్తోంది. అయితే ఇన్నాళ్లు ఆమె భర్త మరియు ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడకు వచ్చి ఉంటారని చాలా మంది అనుకున్నారు. కాని ఆమె అక్కడ నుండి విడాకులు తీసుకుని వచ్చినట్లుగా పేర్కొనడంతో ఆమె గురించి గూగుల్ చేయడం మొదలు పెట్టారు.

టీవీ9 దేవి నాగవళ్లి భర్త ఎవరు ఏం చేస్తాడు అంటూ సెర్చింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జనాల్లో ఈ క్యూరియాసిటీ ఖచ్చితంగా ఉంటుంది. అయితే నెట్ లో మాత్రం దేవికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి. విడాకులు ఎలాంటి వివాదం లేకుండా జరిగాయి కనుక మీడియాలో ఎలాంటి వార్తలు రాలేదని అందుకే అతడి గురించి ఎక్కడ కూడా లేదు. ఆమె గతం గురించి ఇప్పుడు అనవసరం. ప్రస్తుతం ఆమె బిగ్ బాస్ లో ఎలా ఉండబోతుందో చూద్దాం.