మా ఆయన కాళ్ల పై పడి బోరుమన్నాడు!- పూనమ్ పాండే

0

బాలీవుడ్ హాట్ బాంబ్ పూనమ్ పాండే తరచూ వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్ లో పెద్దగా సినిమాలు చేయకపోయినా నిత్యం సెలబ్రిటీలా వార్తల్లో నిలవడం ఈ అమ్మడి ప్రత్యేకత. పలు డీగ్రేడ్ సినిమాలతో ఈ భామ ఒక సెక్షన్ ఆడియెన్ లోనూ పాపులారిటీ దక్కించుకుంది. అప్పట్లో తన పేరుతో ఓ యాప్ ని క్రియేట్ చేసి సెమీ శృంగార వీడియోలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పూనమ్ తనతో గత కొంత కాలంగా సన్నిహితంగా వుంటున్న సామ్ బాంబేని హఠాత్తుగా వివాహం చేసుకుని షాకిచ్చింది.

పూనమ్ అనూహ్య నిర్ణయంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. పెళ్లి తరువాత భర్త తో కలిసి హాలీడే ట్రిప్ కోసం గోవాకు వెళ్లిన పూనమ్ జోడీ అక్కడ ఓ రేంజ్ లో రచ్చ చేసింది. అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఓ విధంగా హనీమూన్ ట్రిప్ లా మైమరిచి పోయింది. అయితే ఓ రోజు హోటల్ గదిలో తన భర్త తనని హింసించాడని సంచలనం సృష్టించిన పూనమ్ పాండే భర్తపై కేసు పెట్టి షాకిచ్చింది.

పెళ్లై పట్టుమని 15 హేను రోజులు కూడా కాకుండానే పూనమ్ భర్త సామ్ బాంబేతో విడిపోవడానికి రెడీ కావడం బాలీవుడ్ వర్గాలని షాక్ గురిచేసింది. అయితే అనూహ్యంగ నాటకీయ పరిణామాల మధ్య మళ్లీ తను పెట్టిన కేసుని పూనమ్ విత్ డ్రా చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తన భర్త కాళ్ల దగ్గర కూర్చుని ఏడుస్తున్నాడని.. ఆ కారణంగానే తను పెట్టిన కేస్ ని వాపస్ తీసుకున్నానని ప్రకటించింది పూనమ్ పాండే.