పవర్ స్టార్ సినిమాల లైనప్ చూస్తే మతిపోవాల్సిందే…!

0

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు బ్యాలన్స్ చేయడం కష్టంగా మారుతుందని భావించి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత ఫోకస్ మొత్తం పాలిటిక్స్ పైనే పెట్టాడు. అయితే ఇప్పుడప్పుడే మళ్ళీ ఎన్నికలు లేకపోవడం.. అందులోనూ పార్టీ కార్యకలాపాల కోసం ఆర్థికంగా నిలదొక్కుకోవడం అవసరమని భావించిన పవన్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో కెరీర్ లో ఎప్పుడూ లేనంత స్పీడ్ గా వరుస సినిమాలను ఓకే చేస్తూ అభిమానులని ఉక్కిరిబిక్కరి చేస్తున్నారు. తమ హీరోని మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద చూడలేమని బాధ పడ్డ పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ లైనప్ చూసి ఖుషీ అవుతున్నారు.

కాగా పవన్ కళ్యాణ్ ముందుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ‘పింక్’ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు మరియు బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీ కమిట్ అయ్యాడు పవన్. ఈ సినిమాని ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మించనున్నారు. రెండు సినిమాలు త్వరగా కంప్లీట్ చేసి తన కెరీర్లో 28వ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాలని నిర్ణయించుకున్నారు పవన్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇప్పుడు లేటెస్టుగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. వీటితో పాటు డాలీ డైరెక్షన్ లో ఓ సినిమా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడని ఫిలిం సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నాడు అని తెలియగానే అందరూ 2024 ఎన్నికల లోపు ఎన్ని సినిమాలు చేయగలిగితే అన్ని మూవీస్ చేయాలని పవన్ నిర్ణయించుకున్నాడని.. తర్వాత మళ్ళీ రాజకీయాల్లో బిజీ అయిపోతారని అందరూ భావించారు. ఈ క్రమంలో అందరి దగ్గర అడ్వాన్స్ తీసుకొని వరసగా సినిమాలు చేయడానికి పవర్ స్టార్ గట్టిగానే ప్రణాళిక పెట్టుకున్నాడని కామెంట్స్ వచ్చాయి. అయితే ఈ సినిమాలన్నీ కంప్లీట్ అవడానికి చాలా ఏళ్ళు పడుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ సినిమాలు కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు పవన్ లైన్ లో పెట్టిన సినిమాల లిస్ట్ చూసి తెగ సంబరపడిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొనసాగాలని వారు కోరుకుంటున్నారు.