Templates by BIGtheme NET
Home >> Cinema News >> సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ

సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ


డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీ డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది. దానికి తగ్గట్లుగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఓవర్సీస్ లో 1.4 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే అందుకుంది. ఇది ఈ ఏడాదిలోనే రికార్డ్ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ కావడం విశేషం.

ట్రైలర్స్ తోనే సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా సినిమా ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇప్పుడు సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ అరుదైన రికార్డ్ ని అందుకుంది. ఏకంగా 35.25 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. ఇప్పటి వరకు ఏ సినిమాకి కూడా ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు

ఆంధ్రప్రదేశ్ లో 13.25 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి, నైజాం ఏరియాలో 6 లక్షల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడైపోయాయి. నార్త్ ఆంధ్రాలో 5.25 లక్షల టికెట్లు సోల్డ్ అయ్యాయి. కర్ణాటకలో 3.25 లక్షణ టికెట్లు బుక్ అయ్యాయి. కేరళలో 1.5 లక్షల టికెట్లు, తమిళనాడులో 1 లక్ష టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ జరిగాయి. మల్టీప్లెక్స్ చైన్ థియేటర్స్ పీవీఆర్, ఐనాక్స్, సినిపోల్స్ లో టికెట్ బుకింగ్స్ పరిగణంలోకి తీసుకోకుండా వేసిన లెక్కల్లోనే ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం నిజంగా అరుదైన రికార్డ్ అని చెప్పాలి.

ఈ జోరు చూస్తుంటే ఓపెనింగ్ డే రోజునే 200 కోట్ల వరకు కలెక్షన్స్ ని సలార్ మూవీ కొల్లగొట్టే అవకాశం ఉందనే మాట ట్రేడ్ పండితుల నుంచి వినిపిస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే ఈ అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని కూడా కేవలం ప్రభాస్ కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ తో వచ్చినవని చెప్పాలి. ప్రశాంత్ నీల్ ట్రేడ్ మార్క్,కి ప్రభాస్ బ్రాండ్ ఇమేజ్ తోడు కావడంతోనే సలార్ అన్ని రికార్డులని తుడిచేస్తూ రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరగడం విశేషం.