‘ఆదిపురుష్’ రాముడే కాని రాముడు కాదు!

0

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి దేశ వ్యాప్తంగా ఒకటే చర్చ. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు అని రావణుడి పాత్రకు సైఫ్ అలీ ఖాన్ ను ఎంపిక చేశారని సీత పాత్రకు కీర్తి సురేష్ అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. అయితే చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఈ సినిమాకు రామాయణంకు సంబంధం లేదు అన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

రామాయణంను ఇప్పటి వరకు ప్రేక్షకులు ఎన్నో సినిమాల్లో చూశారు. కాని ఈసారి చాలా విభిన్నంగా దర్శకుడు చూపించబోతున్నాడు. విభిన్నంగా చూపించి రామాయణం అంటే ప్రేక్షకుల నుండి విమర్శలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే ఇది రామాయణం అని చెప్పకుండా ప్రభాస్ రాముడు కాదు అంటూ చెబుతూ రాముడిగానే ప్రభాస్ ను చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ప్రభాస్ గెటప్ ఈ చిత్రంలో చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు.

గెడ్డం పొడవాటి జుట్టు కండలతో ప్రభాస్ ఈ చిత్రంలో కనిపించే అవకాశం ఉందట. ఇప్పటికే ప్రభాస్ కు లుక్ కు సంబంధించి స్కెచ్ లు ఫైనల్ అయ్యాయి. వచ్చే ఏడాదిలో సినిమాను పట్టాలెక్కించి 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా పక్కా ప్రణాళికతో దర్శకుడు ఓం రౌత్ ముందుకు వెళ్తున్నాడు. హిందీ తెలుగులో వేరు వేరుగా రూపొందబోతున్న ఈ సినిమాను సౌత్ లో అన్ని భాషల్లో డబ్ చేయడంతో పాటు ఇతర భాషల్లో కూడా డబ్ చేసే యోచనలో ఉన్నారు. మొత్తానికి ప్రభాస్ చేసేది రాముడి పాత్ర అయినా అది రామాయణం కాదని ప్రభాస్ రాముడు కాదంటూ యూనిట్ సభ్యులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.