Templates by BIGtheme NET
Home >> Cinema News >> కరోనా టైమ్ లో నిర్మాతల్ని ఆదుకుంటున్న డబ్బింగులు

కరోనా టైమ్ లో నిర్మాతల్ని ఆదుకుంటున్న డబ్బింగులు


కరోనా లాక్ డౌన్ టాలీవుడ్ కి చాలా పాఠాల్ని నేర్పించింది. ఈ నాలుగైదు నెలల్లో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. థియేటర్లు తెరవకపోతే ఆల్టర్నేట్ గా ఓటీటీ ఏటీటీ విజృంభించాయి. వీటిలో సినిమాలు వీక్షించేందుకు యూత్ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక థియేటర్లు తెరిచే వరకూ ఈ పరిస్థితి ఇలానే కొనసాగనుంది.

అంతేకాదు ఇప్పట్లో షూటింగులకు అవకాశం లేదు కాబట్టి వేరొక కొత్త విధానంలో ఆర్జన ఎలా? అన్నది నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అలా పాత హిట్టు సినిమాల్ని డబ్బింగ్ చేసి ఓటీటీల్లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. తెలుగు సినిమాల్ని ఇతర భాషల్లోకి అనువదించి ఆన్ లైన్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే పొరుగు భాషా చిత్రాల్ని ఓటీటీలు అనువదించి తమ వేదికపై అందిస్తున్నాయి.

అదే కోవలో తెలుగు మూవీ `అరవింద సమేత` ఇరుగు పొరుగు భాషల్లోకి అనువాదమవుతోంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా `అరవింద సమేత`. పూజా హెగ్డే కథానాయికగా నటించింది. తారక్ కెరీర్లో అత్యధిక వసూళ్ల చిత్రంగా నిలిచింది. తారక్ సిక్స్-ప్యాక్ మేకోవర్ .. భారీ యాక్షన్ ఎపిసోడ్లకు అభిమానులు సినీ ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఈ చిత్రం త్వరలో హిందీ మరియు కన్నడ భాషలలో డబ్ కానుంది. ఇప్పటికే డబ్బింగ్ ఫార్మాలిటీస్ మొదలెట్టారని తెలుస్తోంది. మరో రెండు నెలల్లో ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.