Templates by BIGtheme NET
Home >> Cinema News >> నిర్మాతలకు ప్రభాస్ అల్టిమేటం

నిర్మాతలకు ప్రభాస్ అల్టిమేటం


బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ప్రకటించి వేడి మీద ఉన్నాడు ప్రభాస్. వెంట వెంటనే పూర్తి చేసి డైహార్డ్ ఫ్యాన్స్ కి వరుస ట్రీటివ్వాలన్నది ప్లాన్.అయితే అందుకు ప్రతిదీ అనుకూలించాలి కదా? తాను అన్నిటికీ సిద్ధంగా ఉన్నా తనలా ఆలోచించి వార్ నడిపించే యుద్ధ సైనికులు తన వెంట అవసరం. ఇక అందరినీ నడిపించే కెప్టెన్ ఆయనతో పాటు నిర్మాతలు కూడా సిద్ధంగా ఉండాలి. అయితే ఫైనాన్స్ ఎలిమెంటే కాస్త ఆలోచించదగ్గది. వందల కోట్ల పెట్టుబడులు పెట్టే భారీ పాన్ ఇండియా సినిమాలకు అంతే భారీగా ఫైనాన్సులు తెచ్చి పకడ్భందీ ప్రణాళిక వ్యూహంతో సినిమాల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.

పైగా ఓంరౌత్ తో 3డి మూవీ చేస్తూనే నాగ్ అశ్విన్ తో సైన్స ఫిక్షన్ మూవీకి ప్లాన్ సిద్ధం చేయాల్సి ఉంది. కేవలం నాగ్ అశ్విన్ సినిమా కోసం రెండేళ్ల సుదీర్ఘ సమయం పడుతుందన్న అంచనా ఉంది. అలాంటప్పుడు ఆ సినిమా పూర్తయ్యేవరకూ ప్రభాస్ కమిటైన ఇతర నిర్మాతలు వేచి చూడాల్సి ఉంటుంది. ఈలోగానే ఎవరైనా కంగారు పడినా ఫలితం ఉండదు. ఇటీవలే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కి హోంబలే సంస్థకు ప్రభాస్ కమిట్ మెంట్ ఇచ్చేసారు. అయితే ప్రశాంత్ నీల్ ఇంకా రెండేళ్లు పైగానే వేచి చూడాల్సి ఉంటుంది.

డైహార్డ్ ఫ్యాన్స్ కోసం ప్రభాస్ ఎన్నో రిస్కులు చేస్తున్నాడు. తన కెరీర్ లో క్షణకాలం కూడా వృధా పోకుండా శ్రమిస్తున్నాడు. వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమాలను ఎప్పటికి పూర్తి చేస్తాడో చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే ఎక్కువ సమయం వృథా చేసి తన సినిమాలను ఆలస్యం చేయకూడదని ప్రభాస్ ను సన్నిహితులు హెచ్చరిస్తున్నారట.

రాధేశ్యాం రిలీజ్ చూస్తూనే.. ఓం రౌత్ మూవీని వేగంగా పూర్తి చేసి వెంటనే నాగ్ అశ్విన్ తో మొదలెట్టాలి. అతడితోనూ చెప్పిన సమయానికి పూర్తి చేసి ప్రశాంత్ నీల్ కి లైన్ క్లియర్ చేయాలి. ఇదంతా చేయడానికి చాలా గట్టి ప్రణాళిక అవసరం. కనీసం 2 సంవత్సరాల సమయం పట్టే నాగ్ అశ్విన్ చిత్రం తోనే చిక్కులు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం కుదిరితేనే చెప్పిన సమయానికి రిలీజ్ సాధ్యం. అందుకే తన నిర్మాతలందరికీ ప్రభాస్ అల్టిమేటం జారీ చేశారట. 2022లోపు మూడు సినిమాల్ని పూర్తి చేసి రిలీజ్ చేయాల్సి ఉంది. ఆ మేరకు నిర్మాతలకు ప్రతిదీ వివరించి చెప్పాడట. డార్లింగ్ వ్యూహం సజావుగా సాగితే ఇండియాలోనే గ్రేట్ స్టార్ గా ప్రభాస్ తనని తాను మలుచుకోవడం కష్టమేమీ కాదు.