Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఇండియన్ మైకేల్ జాక్సన్ సరికొత్త అవతారం

ఇండియన్ మైకేల్ జాక్సన్ సరికొత్త అవతారం


మల్టీ ట్యాలెంటెడ్ ప్రభుదేవా ఇప్పటికే హీరోగా.. దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక మొదటి సారి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న ప్రభుదేవా కీలక పాత్రలో ‘బఘీరా’ అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో ప్రభుదేవా సీరియల్ కిల్లర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించిన లుక్ ను విడుదల చేశారు. రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. ఈ సినిమా లో ప్రభుదేవ లుక్ మరీ విభిన్నంగా అత్యంత భయంకరంగా ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.

ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించడంతో పాటు దర్శకత్వం వహించి.. స్టార్ లకు సూపర్ స్టార్ లకు డాన్స్ కంపోజ్ చేసిన ప్రభుదేవా మొదటి సారి నెగటివ్ షేడ్స్ లో నటించబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. సౌత్ లో నాలుగు భాషలతో పాటు హిందీలో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా లో ప్రభుదేవా నెగటివ్ షేడ్స్ అంటూ దర్శకుడు స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 5 మంది హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమాలో ప్రభుదేవా పాత్ర జంగిల్ బుక్ లోని బఘీరా పాత్రను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చే అవకాశం ఉందంటున్నారు.