బీచ్ లో దిగిపోయిన బికినీ కొంగ

0

డల్లుగా ఉంటే ఏం చేయాలి? .. దగ్గరలో అందుబాటులో ఏదైనా బీచ్ ఉంటే వెళ్లిపోవాలి. అక్కడ సముద్రపు అలలపై ఆటలాడుకోవాలి. కుదిరితే తీరంలోని ఇసుక తిన్నెల్లో పీతల్ని నత్తల్ని పట్టుకోవాలి. ఇదిగో ఇక్కడ అలాగే కనిపిస్తోంది ప్రగ్య జైశ్వాల్ వ్యాపకం. ట్రాపికల్ మైండ్ (డల్ అయ్యాక బ్రైట్ నెస్ కోసం ప్రయత్నం) తో బీచ్ కి వెళ్లిందట పాపం.

వెళితే వెళ్లింది కానీ.. అలాంటి మూడ్ లో కూడా ఈ అమ్మడు ఎక్కడా తగ్గనే లేదు. అదిరిపోయే బికినీలో దిమాక్ ఖరాబ్ చేసేసిందంతే. అప్పుడే కొల్లేరులో దిగిన కొంగలా ఎంత అందంగా లయ బద్ధంగా కనిపిస్తోందో కదా? ఆరడుగులకు 10 ఇంచీలు తక్కువ కానీ.. ప్రగ్య జైశ్వాల్ కి ఏం తక్కువని. కంచె సినిమాతోనే కుర్రకారు గుండెల్లో కంచె వేసేసిన ఈ అమ్మడు ఆ తర్వాత సరైన ఆఫర్లు ఇవ్వకపోవడంతో రేసులో వెనకబడింది. కనీసం ఇప్పుడైనా ఆరడుగుల బుల్లెట్టు లాంటి పవన్ కల్యాణ్ మూవీలో ఆఫర్ దక్కినట్టేనా? అన్నది తనే చెప్పాలి.

అయినా ఇలా సోషల్ మీడియాల ద్వారా అభిమానుల్ని మాత్రం విడిచిపెట్టడం లేదు. ప్రగ్య షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. బీచ్ అయినా ఆ నురుగు వచ్చే నీటిలో ఆటలాడుకోవాలన్న మనసుండాలే కానీ మైండ్ అలా అలా రిలాక్స్ అయిపోదూ? ఫ్రెష్ మైండ్ తో వెతికితే మంచి ఆఫర్ పట్టేస్తుందేమో ప్రగ్య!